బాలయ్యతో ఢీకొట్టనున్న రోజా..!

త్వరలో ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే అది అసెంబ్లీలో కాదు..ఆన్ ‌స్రీన్‌పై. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్‌లో ‘రూలర్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది అయిపోయిన వెంటనే బోయపాటి డైరెక్షన్‌లో మూవీ కమిటయ్యాడు. ప్రస్తుతం బోయపాటి కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు మాములుగా ఉండవు. గతంలో వీరిద్దరూ కలిసి […]

బాలయ్యతో ఢీకొట్టనున్న రోజా..!
Ram Naramaneni

|

Nov 27, 2019 | 11:49 AM

త్వరలో ఇద్దరు ఏపీ ఎమ్మెల్యేల ఫైట్ జరిగేలా కనిపిస్తోంది. అయితే అది అసెంబ్లీలో కాదు..ఆన్ ‌స్రీన్‌పై. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్‌ రవికుమార్ డైరెక్షన్‌లో ‘రూలర్’ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది అయిపోయిన వెంటనే బోయపాటి డైరెక్షన్‌లో మూవీ కమిటయ్యాడు. ప్రస్తుతం బోయపాటి కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక బాలయ్య, బోయపాటి కాంబో అంటే అంచనాలు మాములుగా ఉండవు. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను కూడా అదే రేంజ్‌లో హిట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నటీనటుల ఎంపికపై దృష్టి పెట్టాడు డైరెక్టర్ బోయపాటి.

అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే..కథ రీత్యా, లేడీ విలన్ ఛాయలున్న పాత్ర కోసం నగరి ఎమ్మెల్యే రోజాను అప్రోచ్ అయ్యాడట డైరెక్టర్. అందుకు ఆమె సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఇది కానీ ఫిక్స్ అయితే..సినిమా రేంజ్ మరో స్థాయికి వెళ్తుంది. గతంలో బాలయ్య, రోజా కలిసి  భైరవద్వీపం, బొబ్బిలి సింహం, పెద్దన్నయ్య లాంటి చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా ఆడిపాడారు. ఇప్పడు ఒకరిపై ఒకరు పోట్లాటకు దిగనున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ సంజత్ దత్ సైతం మూవీలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu