Hero Kartikeya: ఆర్ఎక్స్ 100 హీరో ఆశలన్నీ ఆ సినిమా పైనే.. కార్తికేయ కొత్తమూవీ

ఆ తర్వాత విలన్ అవతారం ఎత్తాడు.. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఏకంగా తమిళ్ స్టార్ హీరో అజిత్ తో తలపడ్డాడు.

Hero Kartikeya: ఆర్ఎక్స్ 100 హీరో ఆశలన్నీ ఆ సినిమా పైనే.. కార్తికేయ కొత్తమూవీ
Kartikeya
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 01, 2022 | 9:44 AM

కార్తికేయ గుమ్మకొండ.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు కార్తికేయ. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కానీ తొలి సినిమా స్థాయి విజయాన్ని అందుకోలేక పోయాడు. ఆ తర్వాత విలన్ అవతారం ఎత్తాడు.. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తర్వాత ఏకంగా తమిళ్ స్టార్ హీరో అజిత్ తో తలపడ్డాడు. వలిమై సినిమాలో అజిత్ కు పోటీగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించాడు. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ యంగ్ హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. ఈ సినిమాలో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

క్లాక్స్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.  ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న ‘కలర్ ఫొటో’ నిర్మించిన బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న తాజా చిత్రమిది.

ఇక ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు కార్తికేయ. ఈ సినిమాతో మరోసారి హీరోగా సక్సెస్ అవ్వాలని చూస్తున్నారు. బలమైన కథతో తెరకెక్కుతోన్న ఈ సినిమానుంచి పోస్టర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్  అవుతాయని చిత్రయూనిట్ చెప్తుంది . ఇక ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం. ఇందులో స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. అలాగే, కడుపుబ్బా నవ్వించే వినోదం ఉంది” అని నిర్మాత తెలిపారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి