Aishwarya Lekshmi: మన దగ్గర సినిమా చేయాలని ఆశపడుతోన్న ముద్దుగుమ్మ.. మరి ఛాన్స్ లు వచ్చేనా..?
హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది.
ఇటీవల విడుదలైన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది అందాల భామ ఐశ్వర్య లక్ష్మీ. చూడచక్కని రూపం, ఆకట్టుకునే నటన ఈ అమ్మడి సొంతం. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది. హీరో విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మికథానాయికగా నటిస్తోంది. ‘ఆర్ టీ టీమ్వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ‘మట్టి కుస్తీ’ విశేషాలని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకుంది ఈ భామ.
ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. మూడేళ్ళ క్రితం కోవిడ్ కి ముందే ‘మట్టి కుస్తీ’ కథ విన్నాను. నాకు చాలా నచ్చింది. అయితే ఇందులో హీరోయిన్ పాత్ర చాలా సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్రకు న్యాయం చేయలేనని అనిపించింది. ఇదే విషయం దర్శకుడికి చెప్పా. తర్వాత కోవిడ్ వచ్చింది. మూడేళ్ళ తర్వాత స్క్రిప్ట్ మళ్ళీ నా దగ్గరికే వచ్చింది. ఈ గ్యాప్ లో కొన్ని సినిమాలు చేయడం వలన కాన్ఫిడెన్స్ వచ్చింది. దీంతో ‘మట్టి కుస్తీ’ ని చేయాలని నిర్ణయించుకున్నా అని తెలిపింది.
అలాగే తెలుగు ప్రేక్షకుల గురించి మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులు సినిమాని గొప్పగా ప్రేమిస్తారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ గా ఎదిగింది. టాలీవుడ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని రూల్ చేస్తోంది. తెలుగు నుండి వస్తున్న ప్రతి ప్రాజెక్ట్ కు గొప్ప ఆదరణ వస్తోంది. చాలా పరిశ్రమలు తెలుగు ఇండస్ట్రీని ఫాలో అవ్వడం గమనించాను. తెలుగు ప్రేక్షలులకు సినిమా పట్ల వున్న అభిమానం, ప్రేమే దీనికి కారణం. తెలుగు సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. నటీనటులందరూ ప్రేక్షకులకు వినోదం పంచడానికి కృషి చేస్తారు. ప్రేక్షకులు ఇష్టపడే సినిమాలు చేస్తారు అని తెలిపింది.
అలాగే టాలీవుడ్ లో సాయి పల్లవి, సత్యదేవ్ లతో పరిచయం వుంది. అలాగే తెలుగులో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాను అని తెలిపింది. మరి ఈముద్దుగుమ్మకు మన హీరోలు ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. గతంలో సత్య దేవ్ నటించిన గాడ్సే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. మరి ఇప్పుడు తిరిగి తెలుగులో అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.