‘బంగారు బుల్లోడు’ ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైన అల్లరి నరేష్..

'బంగారు బుల్లోడు' ట్రైలర్ రిలీజ్.. కడుపుబ్బ నవ్వించేందుకు సిద్ధమైన అల్లరి నరేష్..

అల్లరి నరేష్, పూజా జవేరీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'బంగారు బుల్లోడు'. గిరి పల్లిక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా..

Rajitha Chanti

|

Jan 19, 2021 | 6:28 PM

అల్లరి నరేష్, పూజా జవేరీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. గిరి పల్లిక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ ఈ మూవీని నిర్మిస్తుంది. మంగళవారం ఈ సినిమా ట్రైలర్‏ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ ట్రైలర్ చూస్తుంటే గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్‏లో పల్లెటూరి వాతావరణాన్ని ఈ సినిమా తెరకెక్కినట్లుగా కనిపిస్తోంది. ఇక మళ్లీ ఈ మూవీతో అల్లరి నరేష్ ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది.

ఈ సినిమాలో నరేష్ బ్యాంక్ ఉద్యోగిగా.. కస్టమర్లు కుదువ పెట్టిన బంగారాన్ని తన అవసరాలకు వాడుకుంటూ ఉండడం ఈ వీడియోలో చూడోచ్చు. అలాగే ఎండకు అమ్మాయి కాళ్ళు కాలుతున్నాయని నరేష్ అక్కడే ఉన్న బిందెను తన్నడం, అది కాస్త వేడి నీళ్ళ గిన్నె అని తెలిసి నాలుక కరుచుకోవడం వంటి సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ఇక ఈ మూవీలో నరేష్‏తోపాటు పృథ్వీరాజ్, ప్రవీణ్, వెన్నెల కిషోర్‏లు కూడా తమ పాత్రలతో మరోసారి కమెడీని క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమా జనవరి 23న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

Also Read:

Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్.. బాక్సింగ్ పంచ్‌తో అదరగొడుతున్న మెగా హీరో..

Actress Deepika padukone: బ్లూ బ్లేజర్.. కిల్లింగ్ లుక్స్.. ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై దీపికా ఫోటో అదుర్స్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu