ఆస్కార్ నుంచి గల్లీ బాయ్ ఔట్.. కారణాలివేనా..!
ఈసారైనా ఆస్కార్ వస్తుందని ఎదురుచూసిన భారత్ ప్రేక్షకులకు మళ్లీ నిరాశ ఎదురైంది. విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘గల్లీ బాయ్’ చిత్రం ఆ రేసు నుంచి ఔట్ అయ్యింది. సోమవారం ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విడుదల చేసిన టాప్-10 అర్హత చిత్రాల లిస్ట్‌లో ‘గల్లీ బాయ్’ పేరు లేదు. ఈ రేసులో వివిధ భాషల నుంచి మొత్తం 91 చిత్రాలు పోటీ పడగా.. చివరకు 10 మాత్రమే బరిలో నిలిచాయి. దీంతో ఈ […]
ఈసారైనా ఆస్కార్ వస్తుందని ఎదురుచూసిన భారత్ ప్రేక్షకులకు మళ్లీ నిరాశ ఎదురైంది. విదేశీ చిత్రం కేటగిరీలో భారత్ నుంచి నామినేట్ అయిన ‘గల్లీ బాయ్’ చిత్రం ఆ రేసు నుంచి ఔట్ అయ్యింది. సోమవారం ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విడుదల చేసిన టాప్-10 అర్హత చిత్రాల లిస్ట్‌లో ‘గల్లీ బాయ్’ పేరు లేదు. ఈ రేసులో వివిధ భాషల నుంచి మొత్తం 91 చిత్రాలు పోటీ పడగా.. చివరకు 10 మాత్రమే బరిలో నిలిచాయి. దీంతో ఈ సారి కూడా భారతీయులకు నిరాశ ఎదురైనట్లైంది.
కాగా ఇండియన్ రాపర్స్ డివైన్, నైజీ జీవిత కథల ఆధారంగా గల్లీ బాయ్ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకురాలు జోయా అక్తర్. ఇందులో రణ్‌వీర్ సింగ్, అలియా భట్‌లు నటించారు. విడుదలైన సమయంలో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం మంచి కలెక్షన్లను రాబట్టింది. అయితే 8 మైల్స్ అనే హాలీవుడ్ చిత్రం నుంచి ఈ మూవీ కథను తీసుకున్నట్లు కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కథ ఎలా ఉన్నా.. సినిమాను మాత్రం ఆద్యంతం భావోద్వేగాలతో తెరకెక్కించారు జోయా అక్తర్. దీంతో ఈ మూవీకి ఆస్కార్ వస్తుందని మూవీ యూనిట్ భావించింది. కానీ ఆస్కార్ నిర్వాహకులకు ఈ చిత్రం నచ్చలేదు. ఇదిలా ఉంటే మరోవైపు కొందరు నెటిజన్లు ఆస్కార్ అవార్డును సాధించేందుకు ‘గల్లీ బాయ్’ అర్హతలు లేవని.. ఈ సినిమా ఆస్కార్ గెలవదని ముందే ఊహించామని సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతుండటం గమనర్హం. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 91వ అకడమీ అవార్డు ప్రధానోత్సవ వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.