Tollywood: లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

ఈ ఫొటోలో ఉన్న నటుడిని గుర్తు పట్టారా? స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా కనిపించిన ఈ నటుడు హీరోగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. అయితే సినిమా ప్లాఫ్ అవ్వడంతో హీరో రోల్స్ జోలికి వెళ్లలేదు. విలన్ గా, సహాయక పాత్రలతో టాలీవుడ్ ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.

Tollywood: లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Tollywood Actor
Follow us

|

Updated on: Oct 19, 2024 | 3:48 PM

సినిమాల్లోని పాత్రల కోసం తమను తాము మార్చుకునే నటులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. జుట్టు, గడ్డం భారీగా పెంచడం, బరువు పెరగడం, సిక్స్ ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడం.. ఇలా పాత్రలకు తగ్గట్టుగా మారిపోతుంటారు చాలా మంది యాక్టర్స్. అయితే సినిమాల కోసం లేడీ గెటప్పులు వేసే హీరోలు చాలా తక్కువ మందే ఉంటారు. అందుకు చాలా కారణాలున్నాయి. చంటబ్బాయి సినిమాలో చిరంజీవి, మల్లన్న సినిమాలో విక్రమ, పుష్ప2 సినిమాలో అల్లు అర్జున్.. తదితర హీరోలు లేడీ గెటప్పుల్లో అభిమానులను అలరించారు. తాజాగా మరో టాలీవుడ్ నటుడు లేడీ గెటప్‌తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. పై ఫొటో అదే. మరి ఈ నటుడు ఎవరో గుర్తు పట్టారా? ఇతను సుమారు ఇరవై ఎళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. విలన్ గా, సహాయ నటుడిగా వందలాది చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానూ ట్రై చేశాడు కానీ క్లిక్ అవ్వలేకపోయాడు. రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ సినిమాలో టిట్లా పాత్రతో టాలీవుడ్ ఆడియెన్స్ ను భయటపెట్టిన ఈ నటుడు మరెవరో కాదు అజయ్. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటిస్తోన్న పొట్టేల్ సినిమాలో ఈ నటుడు కూడా ఒక కీలక పాత్ర పోషించాడు.

సాహిత్‌ మోత్కూరి తెరకెక్కించిన పొట్టేల్ సినిమాలో అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ ప్రధాన పాత్రలు పోషించాడు. అజయ్ విలన్ పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఈ ట్రైలర్ లో అజయ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. మరీ ముఖ్యంగా ట్రైలర్ ఎండింగ్ లో ఏకంగా లేడీ గెటప్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. దీనిని చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరో పుష్పరాజ్ లా ఉన్నావంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

భార్య, బిడ్డలతో నటుడు అజయ్..

దుబాయ్ వెకేషన్ లో అజయ్ ఫ్యామిలీ..

పొట్టేల్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. 
లేడీ గెటప్‌లో సర్ ప్రైజ్ చేసిన టాలీవుడ్ నటుడు.. 
లండన్‌ ISR సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
లండన్‌ ISR సదస్సులో తెలంగాణ వ్యాపారవేత్తకు ప్రతిష్టాత్మక అవార్డు
వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తినిస్తోంది: ప్రధాని మోదీ
వికసిత్ భారత్ నిర్మాణానికి ఇదే స్ఫూర్తినిస్తోంది: ప్రధాని మోదీ
అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
అంతుచిక్కని రహస్యాలు.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు..
నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా టైటిల్ అదేనా.? ఓజి బాయ్స్ వైరల్..
నాని, శ్రీకాంత్ ఓదెల సినిమా టైటిల్ అదేనా.? ఓజి బాయ్స్ వైరల్..
ఆర్సీబీలో చేరాలని కోరిన ఫ్యాన్.. హిట్ మ్యాన్ రియాక్షన్ చూశారా..
ఆర్సీబీలో చేరాలని కోరిన ఫ్యాన్.. హిట్ మ్యాన్ రియాక్షన్ చూశారా..
కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న.. సాలిడ్ కౌంటరిచ్చిన అనన్య..
కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న.. సాలిడ్ కౌంటరిచ్చిన అనన్య..
16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌
16,347 టీచర్‌ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చేస్తుందోచ్‌
ఓటీటీలో కార్తీ సత్యం సుందరం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఓటీటీలో కార్తీ సత్యం సుందరం.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
ఏపీలో దారుణం.. బాలికను మాట్లాడుదామని పిలిచి..
ఏపీలో దారుణం.. బాలికను మాట్లాడుదామని పిలిచి..