సోయగంలో నదికి సరిజోడి ఈ ముద్దుగుమ్మే.. గార్జియస్ మౌని రాయ్..
Battula Prudvi
19 October 2024
28 సెప్టెంబర్ 1985న వెస్ట్ బెంగాల్‌లోని కూచ్ బెహర్‌లో రాజ్‌బొంగ్షి కుటుంబంలో జన్మించింది అందాల భామ మౌని రాయ్.
ఆమె తాత శేఖర్ చంద్ర రాయ్ ప్రసిద్ధ జాత్రా థియేటర్ ఆర్టిస్ట్. తల్లి ముక్తి థియేటర్ ఆర్టిస్ట్, తండ్రి అనిల్ రాయ్ కూచ్ బెహార్ జిల్లా పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్.
కూచ్‌బెహార్‌లోని బాబర్‌హట్‌లో కేంద్రీయ విద్యాలయంలో 12వ తరగతి వరకు పాఠశాల విద్యను అభ్యసించి ఢిల్లీకి వెళ్లింది.
తన తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్‌ను చేపట్టింది ఈ ముద్దుగుమ్మ.
కానీ కోర్సును మధ్యలోనే వదిలి హిందీ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ముంబైకి వెళ్లింది.
చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉంది. నటీమణులు మధుబాల, మాధురీ దీక్షిత్ మరియు వహీదా రెహ్మాన్‌లను ఈమెకు ఇన్స్పిరేషన్.
2006లో క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్ తో తన కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. నాగిని సీరియల్‌తో ఫేమస్ అయింది.
2022లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్ర చిత్రంలో జూనున్ అనే ఓ పాత్రలో ఆకట్టుకుంది.