Ananya Nagalla: సినిమాకు ముందే కమిట్మెంట్ ఇస్తారా..? రిపోర్టర్ ప్రశ్నకు అనన్య కౌంటర్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ప్రస్తుతం పొట్టేల్ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ లో అనన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Ananya Nagalla: సినిమాకు ముందే కమిట్మెంట్ ఇస్తారా..? రిపోర్టర్ ప్రశ్నకు అనన్య కౌంటర్..
Ananya Nagalla
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 19, 2024 | 3:14 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించడం చాలా కష్టం. ఇది ఒకప్పుడు వినిపించిన మాట. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సినీరంగంలో తెలుగమ్మాయిలు కూడా వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. వైష్ణవి చైతన్య, అంజలి, అనన్య నాగళ్ల, రీతూ వర్మ వంటి స్టార్స్ ఇండస్ట్రీలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరంతా చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపించే కాస్టింగ్ కౌచ్ గురించి ఓ మహిళా రిపోర్టర్ హీరోయిన్ అనన్య నాగళ్లను ప్రశ్నించింది. సినిమాకు ముందే కమిట్మెంట్ అడుగుతారా.. ? ఓకే చెప్తే ఒక లెక్క.. లేదంటే ఇంకో లెక్క అంటూ మహిళా రిపోర్టర్ మాట్లాడుతుండగానే బుల్ షిట్ అంటూ కొట్టిపారేసింది అనన్య. అసలు విషయానికి వస్తే.. అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం పొట్టేల్. ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో నిన్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఓ మహిళా రిపోర్టర్ అనన్యను ప్రశ్నిస్తూ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.

ఇది చదవండి : Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

ఒక హీరోయిన్ కు లేదా.. ఆర్టిస్టుకు ఫస్ట్ సినిమా ఛాన్స్ ఇచ్చేముందు కమిట్మెంట్ అడుగుతుంటారు. వేరే ఇండస్ట్రీలో అలా ఉండదు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా ? ఏం చెబుతారు మీరు అంటూ అడిగేసింది. ఇందుకు అనన్య స్పందిస్తూ.. “మీరు ఇంత హండ్రెడ్ పర్సంట్ కచ్చితంగా ఎలా చెబుతున్నారు. ఫస్ట్ అడుగుతారని.. అలాంటిదేం లేదు” అని చెప్పుకొచ్చింది అనన్య. మరోసారి సదరు మహిళా జర్నలిస్ట్ కమిట్మెంట్ గురించి ప్రశ్నించగా.. ‘నేనెప్పుడు ఫేస్ చేయలేదు. ఇండస్ట్రీలో 50 శాతం పాజిటివ్, 50 శాతం నెగిటివ్ ఉంటుంది. కానీ ఎక్కువగా నెగిటివ్ వైపే చూస్తాం. అంతేకానీ ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చేముందే కమిట్మెంట్ ఉంటుందనేది బుల్ షిట్. నేను ఆ బ్యాడ్ లాంగ్వేజ్ వాడుతున్నందకు సారీ’ అంటూనే కౌంటరిచ్చింది అనన్య.

కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు (రెమ్యునరేషన్).. ఇవ్వకపోతే మరో రేటు.. ఇది మీ ఇండస్ట్రీ వాళ్లే చెబుతుంటారు అని మరోసారి అడగ్గా.. ఇండస్ట్రీలో అలాంటి కమిట్మెంట్స్ ఏమి లేవని చెప్పుకొచ్చింది అనన్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. అనన్య నాగళ్ల మల్లేశం సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.