AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: RCB జట్టులో చేరాలని కోరిన ఫ్యాన్.. హిట్ మ్యాన్ రియాక్షన్ ఏమంటే..?

IPL 2025: ఐపీఎల్‌ లో స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతారా? లేదా? అన్న అంశంపై గత కొంతకాలంగా తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే రోహిత్ శర్మతో పాటు మరో ముగ్గురు స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడం తెలిసిందే.

IPL 2025: RCB జట్టులో చేరాలని కోరిన ఫ్యాన్.. హిట్ మ్యాన్ రియాక్షన్ ఏమంటే..?
Rohit SharmaImage Credit source: PTI
Janardhan Veluru
|

Updated on: Oct 19, 2024 | 3:19 PM

Share

ఐపీఎల్ 2025 రీటెన్షన్ లిస్ట్ త్వరలోనే విడుదలకానుంది. మెగా వేలంలో ఏ స్టార్ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకోనుందన్న అంశంపై క్రికెట్ ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంటోంది. మరీ ముఖ్యంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలో కొనసాగుతాడా? లేదా? అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. గత ఐపీఎల్‌లో రోహిత్ శర్మ స్థానంలో హార్ధిక పాండ్య ముంబై ఇండియన్స్‌కు సారథ్యంవహించాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించడం పట్ల పెద్ద చర్చే జరిగింది. రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడం పట్ల హిట్ మ్యాన్ ఫ్యాన్స్ బాగానే హర్ట్ అయ్యారు.

తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆ జట్టులో కొనసాగుతారా? లేదా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది. రోహిత్ శర్మతో పాటు మరో ముగ్గురు స్టార్ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లను ముంబై ఇండియన్స్ రీటైన్ చేసుకోవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలవడం తెలిసిందే.

ఇదిలా ఉండగా బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియాకు రోహిత్ శర్మ సారథ్యంవహిస్తున్నాడు. ఈ సందర్భంగా స్టేడియం వద్ద ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో మీరు ఏ జట్టులో ఉంటారని ఓ ఫ్యాన్ రోహిత్‌ను ప్రశ్నించాడు. ఏ జట్టులో ఉండాలంటూ హిట్ మ్యాన్ తిరిగి ప్రశ్నించగా.. భాయ్ ఆర్సీబీ జట్టుకు రండి అంటూ ఆ ఫ్యాన్స్ కోరాడు. అయితే దీనిపై ఏ సమాధానం చెప్పకుండా రోహిత్ శర్మ పెవిలియన్ లోపలికి వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ, ఫ్యాన్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రోహిత్ శర్మ, ఫ్యాన్స్ మధ్య ఆసక్తికర సంభాషణ వీడియో..