Guess The Actress: కురుల ముసుగులో ఉన్న ఈ భామ మీరనుకుంటున్న హీరోయిన్ అయితే కాదు.. మరి ఎవరు.?
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే హంగామా అంతా ఇంత ఉండదు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు రీల్స్ చేయడమో లేటెస్ట్ ఫొటోలను సామాజిక మాథ్యమాల్లో పోస్ట్ చేయడమో చేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటారు...
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు చేసే హంగామా అంతా ఇంత ఉండదు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు రీల్స్ చేయడమో లేటెస్ట్ ఫొటోలను సామాజిక మాథ్యమాల్లో పోస్ట్ చేయడమో చేస్తుంటారు. ఈ విషయంలో హీరోయిన్స్ ముందు వరుసలో ఉంటారు. ఒకప్పుడు కేవలం సినిమా విషయాలను మాత్రమే అభిమానులతో పంచుకునే నటీమణులు.. ఇప్పుడు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు టూర్‌లకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా హీరోయిన్స్ పోస్ట్ చేసే ఫొటోల్లో కొన్ని నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఫొటోనే ఒకటి ట్రెండ్ అవుతోంది. పైన ఫొటోలో ఒక అమ్మాయి కనిపిస్తోంది ఎవరో గుర్తుపట్టారా.? ఉంగరాల జుట్టుతో ముఖం మొత్తం కనిపించకుండా ఉన్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఒకేఒక సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను కొల్ల గొట్టిందీ బ్యూటీ. కర్లీ హెయిర్స్, హైట్ తక్కువ.. వీటిని బట్టి ఈ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనే కన్‌క్లూజన్‌కు వచ్చేశారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఈ హీరోయిన్ అనుపమ మాత్రం అస్సలు కాదు.
ఈ బ్యూటీ వెబ్ సిరీస్‌ల ద్వారా సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొన్నీ మధ్యే తొలి సినిమాలో నటించింది. ‘పొట్టి న్యూడిల్స్’గా ప్రేక్షకులకు పరిచయమైంది. అవును మీరు అనుకుంటోంది నిజమే.. ఈ హీరోయిన్ మరెవరో కాదు. ఓరీ దేవుడా హీరోయిన్ మిథిలా పార్కరే. ఒకే ఒక సినిమా ద్వారా క్రేజ్‌ను సొంతం చేసుకుందీ చిన్నది. విశ్వక్ సేన్ సరసన నటించిన ఈ బ్యూటీ తన నటన, అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఈ సినిమాలో మంచి నటనను కనబరించి మెప్పించింది. ప్రస్తుతం అమెరికాలో హాలీడేను ఎంజాయ్ చేస్తున్న మిథిలా అక్కడ దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ముఖం కనిపించకుండా పోస్ట్ చేసిన ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఈ అమ్మడు ఇలా ఫొటో పోస్ట్ చేసిందో లేదో అలా ట్రెండ్ అవుతోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..