Trending : సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సత్యభామే అనే సాంగ్ ఎక్కడిదో తెలుసా..?
చాలా మంది సినిమా పాటలను రీమిక్స్ చేస్తూ ఉంటారు. అందమైన లిరిక్స్ ను ఇంకా అందంగా శ్రావ్యమైన సంగీతాన్ని జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో ఏది.. ఎప్పుడు.. ఎందుకు వైరల్ అవుతుందో చెప్పలేం. ఈ మధ్య కాలంలో చాలా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. చాలా మంది సినిమా పాటలను రీమిక్స్ చేస్తూ ఉంటారు. అందమైన లిరిక్స్ ను ఇంకా అందంగా శ్రావ్యమైన సంగీతాన్ని జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పాత పాటలను.. తాజాగా అలాంటి ఒక పాటె ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసిన అదే పాట. అందమైన అతివలు ఈ పాటకు తనట్టుగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. షేర్ చేయడమే కాదు వేలల్లో వ్యూస్.. లక్షల్లో లైక్స్ సంపాదిస్తున్నారు. ఇంతకు ఆ పాట ఏంటంటే సత్యభామే.. ఈ పాట ఇప్పుడు ట్రేండింగ్ లో ఉంది. సత్యభామే సత్యభామే కోపమేలే అంటూ సాగే లిరిక్స్ వైరల్ అవుతున్నాయి.
దాంతో అసలు ఈ పాట ఏంటి..? ఏ సినిమా లోనిది.? పోనీ ప్రైవేట్ ఆల్బమ్ లో సాంగా.? అని ఆరాతీస్తున్నారు చాలా మంది. అయితే ఈ పాట ఒక సినిమాలోని పాట. ఆ సినిమా చాలా పాత సినిమా.. అలనాటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ నటించిన రవి బంద్ర అనే సినిమాలోని పాట ఇది.. ఈ సినిమాలో హీరో రాజ్ కుమార్ ఎవరో కాదు. కన్నడ స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ తండ్రి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సుమలత నటించారు. ఈ సినిమాలోని పాటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ పాటలోని లిరిక్స్ ను ఇప్పుడు రీమేక్స్ చేశారు. ఈ పాటకు అందాల ముద్దుగుమ్మలు వీడియోలు చేస్తున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..