AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi: క్రియేటివ్ దర్శకుడిని కదిలించిన ఈ చిట్టి స్టోరీ చదివితే.. మీ హృదయం కూడా చిక్కనవుతుంది

కృష్ణవంశీ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన స్టోరీ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అందులో ఎంతో మానవతా దృక్పథం ఇమిడి ఉంది.

Krishna Vamsi: క్రియేటివ్ దర్శకుడిని కదిలించిన ఈ చిట్టి స్టోరీ చదివితే.. మీ హృదయం కూడా చిక్కనవుతుంది
Director Krishna Vamsi
Ram Naramaneni
|

Updated on: Dec 02, 2022 | 10:35 AM

Share

ఆయనో డైరెక్టర్. వెండితెరపై అద్భుతాలు చేస్తుంటారు. కాలంతో కలిసిపోయే సినిమాలు కావు ఆయనవి. ఎప్పుటికీ చెక్కుచెదరణి ఆణిముత్యాలు. పాత్రలను అతను తీర్చిదిద్దే విధానం.. సినిమాలో కనిపించే అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగుదనం.. కుటుంబ విలువలు.. రొమాన్స్‌ను కూడా ఎబ్బెట్టు లేకుండా అందంగా చూపించే నేర్పరతనం ఆయన సొంతం. అమ్మో కృష్ణ వంశీ గారి గురించి చెప్పాలంటే ఈ రోజు సరిపోదు లేండి. ప్రజంట్ ఆయన తన తదుపరి సినిమా రంగమార్తాండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మనందం, రాహుల్ సిప్లిగంజ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం తెరకెక్కింది. కాగా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యారు కృష్ణవంశీ. అద్భుతమైన క్వోట్స్‌తో పాటు తాను మెచ్చిన, తన మనసును కదిలించిన కథలు, కవితలను ఆయన షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన షేర్ చేసిన చిట్టి స్టోరీ మనసులను తాకుతుంది. అది ఎవరు రాశారో తెలియదు కానీ.. అందులో ఎంతో మానవతా దృక్పథం ఇమిడి ఉంది. ఆ స్టోరీ ఏంటో చదివేద్దాం పదండి.

“ఇంటికి వెడుతున్నా నడుచుకుంటూ
.
దారిలో ఒక కరంటు స్థంభానికి ఒక కాగితం కట్టి ఉంది .
.
“దయచేసి చదవండి ” అని రాసి ఉంది . ఖాళీ గానే ఉన్నాను కదా అని దగ్గరకు వెళ్లి చూశాను .
.
.
” ఈ రోడ్డులో నేను నిన్న ఒక 50 రూపాయల నోటు పారేసుకున్నాను . నాకు కళ్ళు సరిగా కనబడవు . మీకు దొరికితే దయచేసి ఈ ఎడ్రెస్ దగ్గరకు తెఛ్చి ఇవ్వగలరు, దయచేసి ఈ సహాయం చెయ్యండి ” అని రాసి ఉంది .
.
.
నాకు ఎందుకో ఆ ఎడ్రెస్ ఉన్న చోటుకు వెళ్ళాలి అనిపించింది
.
అడ్రెస్ గుర్తుపెట్టుకున్నాను .
.
అది ఆ వీధి చివరన ఉన్న ఒక పూరి పాక . దగ్గరకు వెళ్లి పిలిస్తే పాక లో నుండి ఒక వృధ్ధురాలు వచ్చింది . ఆమె కు కళ్ళు సరిగా కనబడటం లేదు .ఆ పాకలో ఆమె ఒక్కర్తే ఉంటోంది అని అర్ధం అయ్యింది . చేతి కర్ర సహాయం తో తడుము కుంటూ బయటకు వచ్చింది
.
.
“ఏమీ లేదమ్మా ! నువ్వు పోగొట్టుకున్న 50 రూపాయల నోటు నాకు కనబడింది . అది ఇఛ్చి పోదామని వచ్చాను ” అన్నాను
.
.
.
ఆమె ఏడుస్తోంది .
.
“బాబూ ! ఇప్పటికి ఇలా దాదాపు 50-60 మంది వఛ్చి ఒక్కొక్కరూ ఒక 50 రూపాయలు ఇస్తున్నారు . నాకు కళ్ళు కనబడవు . నాకు చదవడం రాయడం రాదు .నేను అది రాయలేదు బాబూ ! ఎవరో నాకు సహాయం చెయ్యాలి అనిపించి అలా రాశారేమో !”
.
.
” పోన్లే అమ్మా ఇదిగో ఈ యాభై నోటు తీసుకో ! “
.
.
బాబూ ! అది నేను రాయలేదు . నా ఇబ్బంది చూసి ఎవరో మహానుభావుడు ఇలా రాసిపెట్టి ఉంటాడు . వెళ్ళేటపుడు అది కాస్త చించెయ్యి బాబూ ! అంది
.
.
ఆమె ఇలాగే అందరికీ చెప్పి ఉంటుంది . ఒక్కరూ చించెయ్యలేదు . ఆమె రాయలేదు . ఎవరో ఆమెకు సహాయపడటం కోసం ఇలా రాశారు .
.
.
ఆ రోడ్డున వెడుతున్న ఎందరిలోనో కొందరు అది చూస్తారు . అలా చూసిన ఎందరిలోనో కొందరు ఆమెకు సహాయ పడాలని అనుకుంటారు . అలా అనుకున్న ఎందరిలోనో కొందరు ఆమె ఇంటికి వఛ్చి ఆమెకు సహాయ పడతారు . నేను అది చించేస్తే ఆమెకు అలాంటి సహాయం దూరం చేసిన వాడిని అవుతాను ………… ఇలా సాగుతున్నాయి నా ఆలోచనలు ….. అది చింపెయ్యనా ? ఉంచెయ్యనా ? నాకు చెప్పినట్టే ఇంతకు ముందు వాళ్లకు కూడా చెప్పి ఉంటుంది కదా ! వాళ్ళెవరూ చింపెయ్యలేదు . అంటే అందరూ ఆమెకు ఈ రకంగా సహాయం అందాలి అని కోరుకుంటున్నారు …….. మరి నేను ఎందుకు అది చింపెయ్యడం ……. ఇలా అనుకుంటూ వస్తున్నాను .
.
.
ఒకాయన చేతిలో చిన్న కాగితం పట్టుకుని ఎదురుపడ్డాడు
.
.
.
సర్ ! ఈ ఎడ్రెస్ చెప్పగలరా ? నాకు ఒక 50 నోటు దొరికింది . వాళ్లకి ఇచ్ఛేద్దామని ఎడ్రెస్ అడుగుతున్నాను .
.
.
.
ఆమె ఎడ్రెస్
.
.
.
నాకు అనిపించింది “మానవత్వం చచ్చిపోలేదు” .
.
అది రాసిన వారికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాను . ఎవరికయినా సహాయం చెయ్యాలి అంటే ఎన్నో మార్గాలు . ఈ మార్గం ఎంచుకున్న వ్యక్తిని మనసులోనే అభినందించాను . . ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు ఇది ఒక ఊరట కలిగిస్తుంది అనడం లో నాకు సందేహం లేదు .
.
.
అది చింపడం భావ్యం కాదు .అనిపించింది .
.
.
.
నేను అది చింపేయాలా ? అలా వదిలేయాలా ?
.
.
వదిలేశాను
.
.
.
.
.
వదిలేసి నేను మంచి పని చేశానా ? లేదా ?
.
.
మీరే చెప్పండి …… ఇది కధ అయి ఉండొచ్చు … కానీ ఈ పరిస్థితి ఎదురయితే …”

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..