బ్రేకింగ్: యాంకర్ అనసూయకు జీఎస్టీ షాక్.. నోటీసులు జారీ

యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.55లక్షల జీఎస్టీ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.80లక్షలు అనసూయ బకాయి ఉండగా.. రూ.25లక్షలు మాత్రమే కట్టింది. ఇక మిగిలిన రూ.55లక్షలు కట్టాలంటూ ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గత ఐదు రోజులుగా జీఎస్టీ అధికారులు పలువురు సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి ఇంట్లో ఆ మధ్యన అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక యాంకర్లైన […]

బ్రేకింగ్: యాంకర్ అనసూయకు జీఎస్టీ షాక్.. నోటీసులు జారీ
ఇక పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ తో మెరిసి తన అందంతో కట్టిపడేసింది. 
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 25, 2019 | 12:07 PM

యాంకర్ అనసూయకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. రూ.55లక్షల జీఎస్టీ కట్టాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సర్వీస్ ట్యాక్స్ కింద రూ.80లక్షలు అనసూయ బకాయి ఉండగా.. రూ.25లక్షలు మాత్రమే కట్టింది. ఇక మిగిలిన రూ.55లక్షలు కట్టాలంటూ ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు.

అయితే గత ఐదు రోజులుగా జీఎస్టీ అధికారులు పలువురు సెలబ్రిటీల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి ఇంట్లో ఆ మధ్యన అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక యాంకర్లైన సుమ, అనసూయ ఇళ్లపై కూడా దాడులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె ఘాటుగా స్పందించింది. తన ఆస్తులపై ఎలాంటి దాడులు జరగలేదని సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా మీడియాపై కూడా ఆమె చురకలు అంటించిన విషయం తెలిసిందే.