వంటింట్లో అల్లూరి, భీమ్.. ఎవరా అదృష్ట మహిళ..!
షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు వంటింట్లో దూరిపోయారు. పాకశాస్త్రంలో మంచి పట్టున్న ఈ ఇద్దరు.. అల్పాహారాన్ని భుజించారు. అంతేకాదు తమతో తినే అవకాశాన్ని ఓ మహిళా అభిమానికి కూడా కల్పించారు. ఆ తరువాత ఆ ఇద్దరు ఆ అభిమానితో ఓ సెల్ఫీని తీసుకొని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ బిగ్ స్టార్లైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి […]
షూటింగ్‌కు కాస్త విరామం ఇచ్చిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు వంటింట్లో దూరిపోయారు. పాకశాస్త్రంలో మంచి పట్టున్న ఈ ఇద్దరు.. అల్పాహారాన్ని భుజించారు. అంతేకాదు తమతో తినే అవకాశాన్ని ఓ మహిళా అభిమానికి కూడా కల్పించారు. ఆ తరువాత ఆ ఇద్దరు ఆ అభిమానితో ఓ సెల్ఫీని తీసుకొని గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ బిగ్ స్టార్లైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి మెగా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అక్కడ వారు తీసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే సినిమా ప్రారంభమైన మొదటి రోజు మినహాయిస్తే(అది కూడా జక్కన్న సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందే).. ఇంతవరకు వీరిద్దరు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు బయటకు రాలేదు. ఇక తాజా ఫొటోలో ఎన్టీఆర్, చెర్రీ ఒకేచోట కనిపించడంతో వారిద్దరి ఫ్యాన్స్ సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరోవైపు వీరిద్దరిని కలిసే అవకాశం వచ్చిన ఆ మహిళ ఎవరు..? ఆమె ఎంత అదృష్టవంతురాలో..? అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.
కాగా ఆర్ఆర్ఆర్ షూటింగ్ 70శాతానికి పైగా పూర్తైంది. మిగతా షూటింగ్‌ను కూడా త్వరగా పూర్తి చేసి.. మిగిలిన పనులపై దృష్టి పెట్టాలని రాజమౌళి భావిస్తున్నారట. అలాగే వీలైనంత త్వరగా ప్రమోషన్లను ప్రారంభించాలని ఆయన అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయన పక్కా ప్లాన్ వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో చెర్రీ సరసన అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా కనిపించనుంది. అజయ్ దేవగన్, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలకపాత్రలలో కనిపించనున్నారు. దాదాపు రూ.350 కోట్లతో డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూలై 30 ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో రాబోతున్న ఈ మూవీపై అన్ని ఇండస్ట్రీల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.