AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ మిస్ ఇండియా కారు ఆపి.. దుండగుల వేధింపులు

మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఉషోషి సేన్‌ గుప్తాకు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును అడ్డుకొన్న కొందరు దుండగులు, దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘‘సోమవారం రాత్రి 11.40 గంటలకు పని ముగించుకొని కొలిగ్‌తో కలిసి ఇంటికి వెళుతుండగా.. కొంతమంది ఆకతాయిలు నేను ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. డ్రైవర్‌ను బలవంతంగా బయటకు లాగి, విపరీతంగా కొట్టడం మొదలుపెట్టారు. దాన్ని నేను అడ్డుకున్నాను. […]

మాజీ మిస్ ఇండియా కారు ఆపి.. దుండగుల వేధింపులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 20, 2019 | 10:07 AM

Share

మాజీ మిస్ ఇండియా యూనివర్స్ ఉషోషి సేన్‌ గుప్తాకు కోల్‌కతాలో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తోన్న కారును అడ్డుకొన్న కొందరు దుండగులు, దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.

‘‘సోమవారం రాత్రి 11.40 గంటలకు పని ముగించుకొని కొలిగ్‌తో కలిసి ఇంటికి వెళుతుండగా.. కొంతమంది ఆకతాయిలు నేను ప్రయాణిస్తున్న కారును అడ్డుకున్నారు. డ్రైవర్‌ను బలవంతంగా బయటకు లాగి, విపరీతంగా కొట్టడం మొదలుపెట్టారు. దాన్ని నేను అడ్డుకున్నాను. నిమిషాల్లో మరో పదిహేను మంది యువకులు వారికి తోడయ్యారు. ఈ మొత్తం ఘటనను ఫోన్‌లో రికార్డు చేస్తూనే వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యా. దగ్గరలో ఉన్న మైదాన్ పోలీస్‌ స్టేషన్ అధికారిని సాయం చేయమని కోరా. ఈ కేసు తమ పరిధిలోకి రాదని ఆ పోలీస్ అధికారి స్పందించలేదు. అయితే డ్రైవర్‌ను వాళ్లు చంపేస్తారని గట్టిగా అరవడంతో చివరకు వచ్చి వాళ్లను చెదరగొట్టి వెళ్లిపోయాడు. ఇదంతా అయ్యాక 12గంటల సమయంలో భవానిపూర్ పోలీస్ స్టేషణ్ నుంచి ఇద్దరు పోలీస్ అధికారులు వచ్చారు. ఇంటి దగ్గర డ్రాప్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను కోరా. అప్పుడు కూడా ఆ దుండగులు వదలకుండా ఫాలో అయ్యారు. మరోసారి కారును అడ్డుకుని.. తీసిన వీడియోను డిలీట్ చేయాలంటూ గలాటా చేశారు. కారుపై రాళ్లు విసిరి, ఆపి బ్యాగ్ లాగేశారు. ఫోన్ లాక్కొని దాన్ని పగలగొట్టాలని చూశారు. చివరికి అమ్మ, నాన్న, సోదరి సహాయంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఇలాంటి ఘటనలు రేపు మీకూ ఎదురుకావచ్చు. దీనికి స్పందించి, నిందితులను గుర్తించాలి’’ అంటూ ఆమె కామెంట్ పెట్టారు.

https://www.facebook.com/ushoshi.sengupta/posts/10219744765107548

మరోవైపు దీనిపై పోలీస్‌ విభాగం కూడా ట్విటర్‌లో స్పందించింది. ఈ సంఘటనను చాలా తీవ్రంగా తీసుకున్నామని, కేసు నమోదు చేసి ఏడుగుర్ని అరెస్టు చేశామని కోలకతా పోలీస్ కమిషనర్ తెలిపారు. సీనియర్‌ స్థాయి ఉద్యోగులతో ఈ కేసును దర్యాప్తును చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో కోల్‌కతా పోలీస్‌పై వేటు పడింది. కాగా 2010లో లాస్‌వెగాస్‌లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో సేన్‌గుప్తా ‘ఐ యామ్ షీ – మిస్ యూనివర్స్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్న విషయం తెలిసిందే.