AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

ప్రస్తుతం యూట్యూబ్ సెన్సేషన్ నాగదుర్గ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కూచిపూడితో తన నృత్య ప్రస్థానం ప్రారంభించి, ఆ తర్వాత జానపద డ్యాన్సర్ గా మారిన నాగదుర్గ తన డాన్స్ తో ఆకట్టుకుంటుంది.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ
Naga Durga
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2026 | 1:35 PM

Share

తన డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఫోక్స్ సాంగ్స్ తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అందాల భామ. చూడచక్కని రూపంతో చక్కటి డాన్స్ తో కట్టిపడేస్తుంది ఫోక్ డాన్సర్ నాగ దుర్గ. ఈ చిన్నదానికి సినిమా హీరోయిన్స్ కు మంచి క్రేజ్ ఉంది. ఈ అమ్మడి సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్ ఫ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఫోక్ సాంగ్స్ తో పాటు పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది ఈ చిన్నది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన అభిమాన హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ఓ ఇంటర్వ్యూలో నాగ దుర్గ మాట్లాడుతూ..  తాను ప్రభాస్‌కు డై హార్డ్ ఫ్యాన్ అని తెలిపింది. సినిమా థియేటర్లలో ప్రభాస్ సినిమాలను చూస్తున్నప్పుడు ఆమెకు ఫ్యాన్ గర్ల్ మూమెంట్స్ ఉంటాయని, సాధారణంగా చప్పట్లు కొట్టే అమ్మాయిలా కాకుండా, పేపర్స్ ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తా అని తెలిపింది.  చిన్నతనం నుంచే ప్రభాస్ పై అభిమానాన్ని పెంచుకున్నా అని తెలిపింది. అలాగే నల్గొండలోని తన కాలనీలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేదని, ఆ వాతావరణం నుండి ప్రభాస్‌పై అభిమానం మరింత పెరిగిందని నాగ దుర్గ తెలిపింది. ఆమె నాలుగో తరగతిలో ఉన్నప్పటి నుంచి, ప్రభాస్ ఫ్యాన్స్ యువతలో ఒకరిగా, ఆడియో లాంచ్‌లు, సినిమాల రిలీజ్‌లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.

ప్రభాస్ సినిమా విడుదలైతే  మొదటి రోజు, రెండవ రోజు టిక్కెట్లు కొని స్నేహితులకు ఇచ్చేదాన్ని. వినాయక చవితి కార్యక్రమాల సమయంలో, జానపద పాటలకు డాన్స్ వేసేసమయంలో నన్ను ప్రభాస్ పాటలకు డాన్స్ చేయమని అడిగేవారు. ప్రభాస్ పాట చేయమని అడిగితే మాత్రం కాదనకుండా  డాన్స్ చేసేదాన్ని అని తెలిపింది నాగ దుర్గ. ప్రభాస్ కోసం ఏమైనా చేస్తాననితెలిపింది. నాగ దుర్గ చిన్నతనం నుండి ప్రభాస్ అభిమానుల ఈవెంట్స్ లో, ప్రోగ్రామ్స్  చురుకుగా పాల్గొనేదాన్ని.. ఫ్యాన్స్ నాకు ప్రభాస్ టీ-షర్ట్‌లు, కార్డులు, పెద్ద పోస్టర్‌లు ఇచ్చేవారు అని తెలిపింది. అంతే కాదు స్కూల్ లో ఉన్నప్పుడు తన స్నేహితులకు ప్రభాస్ ఫోటోలను, గ్రీటింగ్ కార్డులను పంచేదాన్ని అని తెలిపింది. ఎనిమిది, తొమ్మిది చదివేవరకు నల్గొండలోని ఆమె గది మొత్తం ప్రభాస్ పోస్టర్‌లతో నిండి ఉండేది. డోర్ పైన, గోడలపైన ప్రభాస్ చిత్రాలు, టీ-షర్ట్‌లు ఆమె గదిలో కనిపించేవని . రెబల్  సినిమా విడుదలైనప్పుడు, అందులో ప్రభాస్ వేసుకున్న కట్ హ్యాండ్స్ టీ-షర్ట్‌లు బాగా పాపులర్ అయ్యాయని.. ఆ టీ-షర్ట్‌లను తన అన్నయ్యలకు, కజిన్స్‌కు కొని బహుమతిగా ఇచ్చినట్లు నాగ దుర్గ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..