తెలుగు సినిమాకు ఓకే చెప్పిన సిద్ధార్థ్.. ఆ హీరోతో మల్టీస్టారర్..!

ఒకప్పుడు వరుస విజయాలు అందుకొని తెలుగులో లవర్‌ బాయ్‌గా విశేష అభిమానులను సంపాదించుకొన్న సిద్ధార్థ్‌.. టాలీవుడ్‌కు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది.

తెలుగు సినిమాకు ఓకే చెప్పిన సిద్ధార్థ్.. ఆ హీరోతో మల్టీస్టారర్..!

ఒకప్పుడు వరుస విజయాలు అందుకొని తెలుగులో లవర్‌ బాయ్‌గా విశేష అభిమానులను సంపాదించుకొన్న సిద్ధార్థ్‌.. టాలీవుడ్‌కు దూరమై దాదాపు ఏడు సంవత్సరాలు అయ్యింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్‌షాలో ఆయన చివరిసారి కనిపించారు. ఆ తరువాత అడపాదడపా డబ్బింగ్ చిత్రాల ద్వారా ప్రేక్షకులను పలకరించారు. ఇక ఆ మధ్యన తెలుగులో మంచి సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తానని మాటిచ్చిన సిద్ధార్థ్‌.. దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తన తెలుగు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం తెలుగులో ఓ సినిమాకు సిద్ధార్థ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా ఓ మల్టీస్టారర్‌కు అని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది.

ఆర్‌ఎక్స్‌ 100తో టాలీవుడ్‌కు పరిచయం అయిన అజయ్‌ భూపతి.. తన రెండో ప్రాజెక్ట్‌గా మహా సముద్రంను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయింది. అంతేకాదు ఇందులో నటించేందుకు రవితేజ ఒప్పుకున్నారు కూడా. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి మాస్‌ రాజా తప్పుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాలో శర్వానంద్ నటిస్తుండగా.. ఇందులో రెండో హీరోగా సిద్ధార్థ్ నటించబోతున్నారట. రవితేజ ఈ ప్రాజెక్ట్‌లో ఉన్న సమయంలోనే సిద్ధార్థ్‌ ఈ మూవీకి డేట్లు ఇవ్వగా.. ఇప్పుడు శర్వాతో నటించేందుకు ఆయన రెడీ అయినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. కాగా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించబోతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్‌గా ఫిక్స్‌  కాగా.. మరో హీరోయిన్ కోసం చిత్ర యూనిట్ పలువురితో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్. మరి ఇందులో నిజమెంత..? మహా సముద్రం ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లనుంది..? అన్న ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో..!

Click on your DTH Provider to Add TV9 Telugu