AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో..!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌.. ఆ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో నటించనున్న విషయం తెలిసిందే

ఎన్టీఆర్ సినిమాలో మరో యంగ్ హీరో..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 28, 2020 | 3:13 PM

Share

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్‌ఆర్‌లో నటిస్తోన్న ఎన్టీఆర్‌.. ఆ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్‌లో నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేయగా.. ప్రస్తుతం త్రివిక్రమ్, స్క్రిప్ట్‌ను రాసే పనిలో పడ్డారు. దాంతో పాటు మరోవైపు నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో మరో యంగ్ హీరో భాగం కానున్నారట.

‘అఙ్ఞ్యాతవాసి’ నుంచి స్టార్‌ హీరోలతో తాను తెరకెక్కించిన ప్రతి సినిమాలో మరో యంగ్ నటుడికి అవకాశం ఇస్తూ వస్తున్నారు త్రివిక్రమ్. ఈ క్రమంలో ‘అఙ్ఞ్యాతవాసి’లో ఆది, ‘అరవింద సమేత’లో నవీన్ చంద్ర, ‘అల వైకుంఠపురములో’లో సుశాంత్ నటించారు. ఆయా పాత్రలు వారికి మంచి పేరును కూడా తీసుకొచ్చాయి. ఇక ఇదే తరహాలో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో మరో నటుడికి అవకాశం ఇవ్వబోతున్నారట. అయితే ఇంకా ఆ పాత్ర కోసం ఎవరికీ కన్ఫర్మ్ చేయనట్లు తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ మూవీలో ఈ సారి భాగం అవ్వబోయే యంగ్ నటుడు ఎవరో తెలుసుకోవాలనుకుంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కబోతోన్న ఈ చిత్రానికి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్‌ను పెట్టినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read This Story Also: త్వరలో మీకూ తెలుస్తుంది.. కిమ్‌ ఆరోగ్యంపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత