AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Father Chitti Uma Karthik: ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులతో.. జగపతిబాబు నేనేం చెయ్య‌.. ను సాంగ్ రిలీజ్

ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌ చిత్ర యూనిట్ సరికొత్త రీతిలో ప్రమోషన్ మొదలు పెట్టింది. సాంగ్స్ ను రీల్ హీరోల‌కు బ‌దులు రియ‌ల్ హీరోల‌తో  విడుదల చేయిస్తుంది. అందులో భాగంగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో..

Father Chitti Uma Karthik: ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులతో..   జగపతిబాబు నేనేం చెయ్య‌.. ను సాంగ్ రిలీజ్
Surya Kala
|

Updated on: Jan 27, 2021 | 1:07 PM

Share

శోభన్ బాబు తరవాత ఆ రేంజ్‌లో మహిళా అభిమానుల ఆదరణ సొంతం చేసుకున్న హీరో జగపతిబాబు.. వరస ప్లాప్స్ తో కెరీర్‌లో యూ టర్న్ తీసుకున్నాడు.. బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ మూవీతో విలన్ గా మారాడు.. వరుస హిట్స్ తో కెరీర్ లో బిజీ అయ్యాడు.. జగపతి బాబు ఈ హీరోగా నటిస్తున్న సమయంలో కంటే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ కెరీర్ లో ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు.. తాజాగా రామ్ కార్తీక్‌, అమ్ము అభిరామి యువ జంట‌గా న‌టించిన ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌ సినిమాలో జగ‌ప‌తిబాబు ప్ర‌ధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 12 న రిలీజ్ కు రెడీ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సరికొత్త రీతిలో ప్రమోషన్ మొదలు పెట్టింది. సాంగ్స్ ను రీల్ హీరోల‌కు బ‌దులు రియ‌ల్ హీరోల‌తో  విడుదల చేయిస్తుంది చిత్ర బృందం.  అందులో భాగంగా కొవిడ్ 19 మ‌హ‌మ్మారిపై అవిశ్రాంతంగా పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌తో ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తూ వ‌స్తోంది. ఇప్ప‌టికే “ముఝ్‌సే సెల్ఫీ లేలో..” అంటూ సాగే తొలి పాట‌ను ప్ర‌ముఖ ఆర్థోపెడీషియ‌న్ డాక్ట‌ర్ ఎ.వి. గుర‌వారెడ్డి చేతులు మీదుగా విడుద‌ల చేశారు. ఈ పాట‌కు సంగీత ప్రియుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.

తాజాగా “నేనేం చెయ్య‌..” అంటూ సాగే రెండో పాట‌ను ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులతో చిత్ర యూనిట్ రిలీజ్ చేయింది. లాక్‌డౌన్ టైమ్‌లో కొవిడ్ నుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడ‌టంలో నిరంత‌రాయంగా పనిచేసి, ఒక‌వైపు ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చూస్తూ, మ‌రోవైపు ఆరోగ్య‌సేవ‌లు అందిస్తూ వ‌చ్చిన ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకోవాల‌నే చిరు ప్ర‌య‌త్నంతోనే “నేనేం చెయ్య..” పాట‌ను వారి చేత రిలీజ్ చేయించామని చిత్ర బృందం తెలిపింది. ఈ సాంగ్ జగపతి బాబు పై చిత్రీకరించారు. ఈ సంద‌ర్భంగా జగపతి మాట్లాడుతూ, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, పారిశుద్ధ్య కార్మికులు “నేనేం చెయ్య‌..” పాట‌ను విడుద‌ల చేయ‌డం ఎంతో గౌర‌వంగా భావిస్తున్నాన‌నీ, ఈ పాట‌ను అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నీ అన్నారు. త్వ‌ర‌లో మ‌రో రెండు పాట‌ల‌ను పోలీసు, మీడియా సిబ్బంది చేతుల మీదుగా విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత దామోద‌ర్ ప్ర‌సాద్, ద‌ర్శ‌కుడు విద్యాసాగ‌ర్ రాజు తెలిపారు. శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌పై కె.ఎల్‌. దామోద‌ర్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగ‌ర్ రాజు ద‌ర్శ‌కుడు. బేబి స‌హ‌శ్రిత మ‌రో కీల‌క పాత్ర‌ధారిలో కనిపించనుంది.

Also Read: అవినీతి కేసులో నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించిన చిన్నమ్మ రిలీజ్.. అయినా మరో 10రోజుల పాటు…

Follow Us
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
బెజవాడ స్టైల్ చిట్టి పునుగులు.. ఇలా చేస్తే ఏమన్నా ఉంటాయా..?
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
IAS అవ్వాలనే అమ్మాయిలకు ఫ్రీగా UPSC కోచింగ్.. కొన్ని గంటలే ఛాన్స్
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
ఇది కదా మానవత్వం అంటే.. 6 కి.మీ. విద్యార్థినిని వీపుపై మోసి..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
తెలంగాణలో వర్షాలపై వాతావరణశాఖ మరో అప్డేట్..
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
ఆషాఢం అమావాస్య రోజే అద్భుతమైనయోగం.. వీరు కోటీశ్వరులు అవ్వడం పక్కా
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
సీఎం విజయ్ 'జననాయగన్' కు సెన్సార్ క్లియరెన్స్! రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో నాలుగులైన్ల హైవే..
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
రైల్వే ఉద్యోగార్థులకు అలర్ట్.. RRB ALP CBT 2 పరీక్ష తేదీ విడుదల
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
భార్యలో ఈ లక్షణాలు ఉంటే, భర్త అదృష్టవంతుడే.. మీ భార్యలో ఉన్నాయా?
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
తరచూ పీడకలలు వస్తున్నాయా? బెడ్‌రూమ్‌లో ఈ తప్పులు అస్సలు చేయొద్దు!