AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదంతా గతం.. నాలోని ఈ ‘పాత్ర’ ఇప్పుడు నిజం!

తమిళ హీరోల్లో అజిత్ కుమార్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి. ఎప్పుడూ కూడా ప్రచారం కోసం తపించకుండా.. హుందాగా.. సమాజం కోసం తపిస్తాడు. ముఖ్యంగా ఆయన మహిళల పట్ల చూపించే గౌరవం చాలా గొప్పది. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది నటీమణులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక లేటెస్ట్‌గా మరో సంఘటన ఆయనలోని గొప్పతనాన్ని మరోసారి చూపించింది. అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్. వినోత్ డైరెక్షన్‌లో ‘నేర్కొండ పార్వై’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. […]

అదంతా గతం.. నాలోని ఈ 'పాత్ర' ఇప్పుడు నిజం!
Ravi Kiran
| Edited By: |

Updated on: Jun 13, 2019 | 8:16 PM

Share

తమిళ హీరోల్లో అజిత్ కుమార్ స్టైల్ పూర్తిగా డిఫరెంట్ అని చెప్పాలి. ఎప్పుడూ కూడా ప్రచారం కోసం తపించకుండా.. హుందాగా.. సమాజం కోసం తపిస్తాడు. ముఖ్యంగా ఆయన మహిళల పట్ల చూపించే గౌరవం చాలా గొప్పది. ఇప్పటికే ఆయనతో పనిచేసిన చాలామంది నటీమణులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇక లేటెస్ట్‌గా మరో సంఘటన ఆయనలోని గొప్పతనాన్ని మరోసారి చూపించింది.

అజిత్ కుమార్ ప్రస్తుతం హెచ్. వినోత్ డైరెక్షన్‌లో ‘నేర్కొండ పార్వై’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీ హిట్ మూవీ ‘పింక్’కు తమిళ రీమేక్. దీని ట్రైలర్ నిన్నే విడుదలైంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ‘ తాను కెరీర్ మొదట్లో మహిళల పాత్రల్ని ఇబ్బందిపెట్టే తరహా పాత్రలు చేశానని.. ఆ తప్పుకు ఇప్పుడు చింతిస్తున్నానని చెప్పారు. అయితే ఆ తప్పును సరిదిద్దుకుని, మహిళల్ని గౌరవించే పాత్రలో ఆదర్శంగా నిలవడానికి ఈ ‘నేర్కొండ పార్వై’ చిత్రం చేస్తున్నాను అన్నారు.

‘తలా’ అజిత్.. తాను చేసిన పొరపాటును ఒప్పుకుని.. దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తానని బాహాటంగా చెప్పడంతో అభిమానుల్లో ఆయన పట్ల గౌరవం మరింత పెరిగింది.

Follow Us