ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఏక్ మినీ కథ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా…

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు.

  • Rajeev Rayala
  • Publish Date - 3:40 pm, Sat, 17 April 21
ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతున్న ఏక్ మినీ కథ.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా...

Ek Mini Katha movie: కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ.. వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్. ఇటీవలే దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ మొదలు పెట్టారు. ఈ బ్యాన‌ర్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఏక్ మినీ కథ చిత్ర ఫస్ట్ లుక్ ఈ మధ్యే విడుదలైంది. ‘డజ్ సైజ్ మ్యాటర్’  అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పేపర్ బాయ్ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో సంతోష్ లుక్ కు అద్భుతమైన స్పందన వస్తుంది. ఇటీవలే  ఈ మాయలో.. లిరికల్ సాంగ్ విడుదలైంది. దీనికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ చిత్ర విడుదల తేదీ ఖరారైంది. ఎప్రిల్ 30న ఏక్ మిని కథ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ సినిమాకు కథ అందించారు. కార్తీక్ రాపోలు ఏక్ మినీ కథ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tamil actor Vivek: కమెడియన్ వివేక్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని..

Actor Vivek: కోరిక తీరకుండానే వెళ్లిపోయిన వివేక్… ఆశయాన్ని తీరుస్తామంటున్న

అభిమానులు..

Co-Director Satyam Death: మరో సినీ ప్రముఖుడిని మింగేసిన కరోనా… ప్రముఖ కో డైరెక్టర్ సత్యం చికిత్స పొందుతూ మృతి