Oscar : ఆస్కార్ అవార్డును అమ్మోచ్చా..? ఒకవేళ అమ్మితే ఎంతవస్తుందో తెలుసా..
అసలు అమ్మోచ్చా లేదా..? ఆస్కార్ అవార్డుకు వలర్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఎంతో క్రేజ్ ఉంది. ఈ అవార్డును దక్కించుకోవాలనే ఆశ ప్రతీ ఫిల్మ్ మేకర్లోనూ ఉంటుంది. అందుకోసమే గట్టి ప్రయత్నము కూడా జరుగుతుంటుంది.
వచ్చిన అవార్డును ఎవరైనా అమ్ముకుంటారా చెప్పండి… అదీ కూడా వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే నెంబర్ వన్ అవార్డ్ గా ఫీలయ్యే ఆస్కార్ అవార్డ్‌ని! ఎవరూ అమ్ముకోరు కదా..! కానీ సపోజ్ పర్ సపోజ్! ఒకవేళ! ఆస్కార్ అవార్డును అమ్మేస్తే ఎంతొస్తుంది? డాలర్స్‌లోనో లేక రూపాల్లోనో.. ఎంత గిట్టుబాటు అవుతుంది.? అసలు అమ్మోచ్చా లేదా..? ఆస్కార్ అవార్డుకు వలర్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే ఎంతో క్రేజ్ ఉంది. ఈ అవార్డును దక్కించుకోవాలనే ఆశ ప్రతీ ఫిల్మ్ మేకర్లోనూ ఉంటుంది. అందుకోసమే గట్టి ప్రయత్నము కూడా జరుగుతుంటుంది. అయితే ఫిల్మ్ ఫెటర్నిటీలో ఎంతో ప్రెస్టీజియస్ అవార్డు గా భావించే ఈ అవార్డును అకాడమీ అవార్డ్స్ పేరుతో.. 1929లో డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్ , విలియం డెమిలీ స్టార్ట్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డును అందజేశారు. అలా స్టార్ట్ అయిన ఈ అవార్డు జర్నీ.. కొన్నేళ్లకే నెంబర్ 1 అవార్డ్స్ స్థాయికి చేరుకుంది. వరల్డ్ ఫిల్మ్ ఫెటర్నిటీలోనే విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.
ఇక ఈ అవార్డు చూడ్డానికి గోల్డ్ కలర్‌లో గోల్డ్ తో చేసినట్టు ఉన్నా కూడా.. అది గోల్డ్ తో చేసింది కాదు. 13.5 ఇంచెస్ హైట్ 4 కేజెస్ వెయిట్ ఉన్న ఆ అవార్డును మొదట కాపర్‌తో చేసి.. దానిపైన గోల్డ్ కోటింగ్ వేసే వారు. ఇప్పుడైతే మెటల్‌తో చేసి.. అప్పటి లానే గోల్డ్ కోటింగ్ వేస్తున్నారు. ఇక 2017లో టైమ్ ఇన్ వాళ్లు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ప్రకారం ఆస్కార్ అవార్డు తయారు చేయడానికి అకాడమీకి 400 డాలర్లు ఖర్చు అవుతుంది. అయితే తిరిగి ఈ అవార్డును అమ్మితే మాత్రం ఒక డాలర్ మాత్రమే రిటర్న్ గా వస్తుంది. అయితే ఇందుకు 1950 తరువాత అకాడమీ తీసుకొచ్చిన రూలే కారణం.
1950 ముందు orson welles అమెరికన్ డైరెక్టర్ బెస్ట్ వర్జినల్ స్క్రీన్ ప్లే కేటగిరీలో తను గెలిచిన ఆస్కార్ అవార్డును వేలం వేశారు. ఆ వేలంలో.. 6.5 కోట్లను దక్కించుకున్నారు. దీంతో సీరియస్ అయిన అకాడమీ.. ఆస్కార్ అవార్డును ఇంకెవరు అమ్మకుండా ఓరూల్ తీసుకొచ్చింది. ఇక దీని ప్రకారమే ఆస్కార్ అవార్డును ఎవరైనా అమ్మాలనుకున్నా.. ఆక్‌షన్ వేయాలనుకున్నా.. ఈ రూల్ చూపించి ఒక డాలర్‌కే.. అకాడమీనే.. అవార్డును తీసుకునే రైట్ వచ్చేలా చేసుకుంది. సో..! ఆస్కార్ అవార్డు ఎవరైనే అమ్మితే వారికొచ్చేది ఒక డాలర్ .. అంటే 82రూపాయలు మాత్రమే!