‘దొరసాని’కి టైమ్ కలిసొచ్చిందే..!

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ విడుదల సడన్‌గా వాయిదా పడింది. జూలై 12న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 18న విడుదల కానుంది. జూలై 14న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఉండడం వల్ల అందరూ కూడా క్రికెట్ మ్యాచ్‌లు చూడడంలో బిజీగా ఉంటారని ఇస్మార్ట్ శంకర్‌ని వాయిదా వేశారట. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను […]

'దొరసాని'కి టైమ్ కలిసొచ్చిందే..!
Follow us

|

Updated on: Jun 23, 2019 | 11:42 AM

రామ్ హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ విడుదల సడన్‌గా వాయిదా పడింది. జూలై 12న రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు జూలై 18న విడుదల కానుంది. జూలై 14న వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఉండడం వల్ల అందరూ కూడా క్రికెట్ మ్యాచ్‌లు చూడడంలో బిజీగా ఉంటారని ఇస్మార్ట్ శంకర్‌ని వాయిదా వేశారట. పూరి జగన్నాధ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరో రామ్ కొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రోమోస్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇస్మార్ట్ శంకర్ వాయిదా పడడంతో ‘దొరసాని’ సినిమా జూలై 12న విడుదల కానుంది. ఈ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. దొరసాని సినిమా టీజర్ ఇప్పటికే విడుదలైంది. 80వ దశకం తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.