పుట్టుకతోనే గుండెజబ్బు.. షూటింగ్‌లోనే రక్తపు వాంతులు.. కట్టుకున్న భర్త కూడా వదిలేశాడు..
చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ గా ఎదిగారు. తమ అందం అభినయంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. స్టార్ హీరోల సరసన నటించింది.

చిత్రసీమలో అందం, నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న నటి అందాల భామ మధుబాల. ఆమె జీవితంలో ఎన్నో విజయాలను అందుకున్న ఆమె సినీ ప్రస్థానంతో పాటు అనేక వ్యక్తిగత సవాళ్లతో నిండి ఉంది. మధుబాల అసలుపేరు ముంతాజ్ జహాన్ బేగం దెహల్వి. 1933లో జన్మించిన మధుబాల జీవితంలో అదృష్టం, దురదృష్టం పక్కపక్కనే పెరిగాయని చెప్పవచ్చు. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్, తల్లి ఆయేషా బేగం దంపతులకు 11 మంది సంతానంలో ఆమె ఐదవ సంతానం. తండ్రి ఉద్యోగం కోల్పోవడంతో, కుటుంబ పోషణ భారం మధుబాల చిన్నతనం నుంచే మోయాల్సి వచ్చింది. ఎనిమిదేళ్ల వయస్సులోనే బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, ఐదేళ్ల పాటు బాలనటిగా నటించి కుటుంబాన్ని పోషించారు మధుబాల. ఆమె తండ్రి అతావుల్లా ఖాన్ స్వభావం మధుబాల జీవితంపై, కెరీర్‌పై చాల ప్రభావాన్ని చూపింది.
ఇది కూడా చదవండి : అప్పట్లో కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్.. అండర్ వరల్డ్ మాఫియా దెబ్బకు రాత్రికి రాత్రే మాయం..
ఆయన తొందరపాటు, దురుసు స్వభావం కారణంగా ఉద్యోగం కోల్పోవడమే కాకుండా, తన కుమార్తె సినిమాలకు అధిక పారితోషికం ఆశించి కొన్ని మంచి అవకాశాలను కోల్పోయేలా చేశారు. ‘తరానా’ సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్ మార్చమని డిమాండ్ చేయడం వల్ల దిలీప్ కుమార్‌తో కలిసి కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. 1947లో కేదార్ శర్మ దర్శకత్వంలో రాజ్ కపూర్‌తో కలిసి ‘నీల్ కమల్’ చిత్రంలో 14 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందారు మధుబాల. ఆ తర్వాత కమల్ ఆమ్రోహి దర్శకత్వంలో వచ్చిన ‘మహల్’ చిత్రంతో అగ్రతారగా ఎదిగారు. దిలీప్ కుమార్‌తో కలిసి ‘తరానా’, ‘మొఘల్-ఎ-ఆజం’ వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు.
ఇది కూడా చదవండి : Jabardasth: జబర్దస్త్‌లో అతను చాలా కమర్షియల్.. భోజనానికి రమ్మని పిలిస్తే పెట్రోల్‌కు డబ్బులు అడుగుతాడు..
‘మొఘల్-ఎ-ఆజం’ సమయంలో దిలీప్ కుమార్‌తో ఆమె ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నప్పటికీ, మధుబాల తండ్రి ఈ సంబంధాన్ని వ్యతిరేకించారు. దిలీప్ కుమార్ మధుబాలను తన కుటుంబం వదిలి రమ్మన్నారు. దానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారి ప్రేమ విఫలమైంది. దిలీప్ కుమార్ తర్వాత సైరా బానును వివాహం చేసుకున్నారు. ఆతర్వాత కిషోర్ కుమార్‌ను పెళ్లి చేసుకున్నారు మధుబాల.. అప్పటికే ఆయన రెండు, మూడు పెళ్లిళ్లు అయ్యాయి. జీవితంలో అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్న మధుబాల, చిన్నతనం నుంచే అనారోగ్యంతో బాధపడ్డారు. చిన్నతనంలోనే గుండె జబ్బుతో బాధపడ్డారు. కొన్నిసార్లు షూటింగ్ సమయంలోనూ రక్తపు వాంతులు కూడా చేసుకున్నారు మధుబాల. ఆమె ఎక్కువకాలం బ్రతకాదు అని తెలిసినప్పుడు కిషోర్ కుమార్ కూడా ఆమెను వదిలేశారు. దాంతో ఆమె జీవితం సవాళ్లు పెరిగిపోయాయి. చివరకు మధుబాల జీవితం సినిమా చరిత్రలో ఒక విషాద గాథగా మిగిలిపోయింది.
ఇది కూడా చదవండి : ఆ ఇద్దరు హీరోలతో సినిమాలు చేయాలనుంది.. ఎప్పుడు ఛాన్స్ వస్తుందో చూడాలి





