AP KGBV Jobs 2026: మహిళలకు ప్రభుత్వ ఉద్యోగావకాశం.. ఏపీ కేజీబీవీల్లో భారీగా టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ప్రిన్సిపల్, పీజీటీ, సీఆర్‌టీలతో పాటు పీఈటీ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఈ కిండి డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది..

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న టీచింగ్ ఉద్యోగాల భర్తీ అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 352 కేజీబీవీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం 299 ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు..
ఏపీలోని కేజీబీవీలో టీచర్ పోస్టులకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు..
- ప్రిన్సిపల్ పోస్టుల సంఖ్య: 16
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGTs) పోస్టుల సంఖ్య: 98
- కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRTs) పోస్టుల సంఖ్య: 133
- ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PETs) పోస్టుల సంఖ్య: 52
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, యూజీడీఈపీ లేదా బీపీఈడీ లేదా ఎంపీఈడీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేద డిగ్రీ, పీజీ, బీఈడీతోపాటు ఏపీ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్ధుల వయోపరిమితి 2025 జులై 1వ తేదీ నాటికి కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠంగా వయస్సు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 ఏళ్లు, దివ్యాంగులకు 52 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో జూన్ 6, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలోని కేజీబీవీలో టీచర్ పోస్టులకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు రుసుము, ప్రాసెసింగ్ ఛార్జీల కింద ప్రతి ఒక్కరూ రూ.300 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే అకడమిక్ మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు వారి అకడమిక్, ప్రొఫెషనల్ కోర్సుల్లో సాధించిన మార్కులకు వెయిటేజీ ఇచ్చి 100 మార్కులకు మెరిట్ జాబితాను రూపొందిస్తారు. అనంతరం జిల్లా స్థాయి కమిటీ ద్వారా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ప్రిన్సిపల్ పోస్టులకు రూ.34,139, పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు రూ.26,759 చొప్పున జీతంగా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
- ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: మే 27, 2026 నుంచి
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 5, 2026 వరకు
- నియామక ఉత్తర్వుల జారీ: జూన్ 18, 2026.
- విధుల్లో చేరాల్సిన తేదీ: జూన్ 20, 2026.
ఏపీలోని కేజీబీవీలో టీచర్ పోస్టులకు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




