AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాల్లో అక్క తోపు.. చెల్లి మిడిల్ డ్రాపు..! 5 సినిమాలతోనే మాయమైపోయింది

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది .

సినిమాల్లో అక్క తోపు.. చెల్లి మిడిల్ డ్రాపు..! 5 సినిమాలతోనే మాయమైపోయింది
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2026 | 5:04 PM

Share

చిత్రపరిశ్రమలో చాలా మంది నటవారసులు ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది స్టార్ హీరో, హీరోయిన్ల కొడుకులు, కూతుర్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ కూడా సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే ఓ అందాల భామ చెల్లి కూడా హీరోయిన్ గా సినిమాలు చేసింది. కానీ అక్క అంత క్రేజ్ తెచుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసిన లాభం లేకుండాపోయింది. దాంతో ఆఫర్స్ లేక సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇంతకూ పైన కనిపిస్తున్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు కురాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. ఆమె ఎవరంటే.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యేరు. అయితే అక్క మాత్రం ఇండస్ట్రీలో తోపు హీరోయిన్. ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది. ఆమె మరెవరో కాదు. ముద్దుగుమ్మ నిషా అగర్వాల్.. ఈ అమ్మడు కాజల్ అగర్వాల్‌కు చెల్లెలు నిషా అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ తన సినీ ప్రస్థానాన్ని 2010లో తెలుగు చిత్రం ఏమైంది ఈవేళతో ప్రారంభించింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

ఆ తర్వాత వరుసగా సోలో , ఇష్టం , సుకుమారుడు, డీకే బోస్, సరదాగా అమ్మాయితో వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో ఏమైంది ఈవేళ, సుకుమారుడు, డీకే బోస్, సినిమాలు కొన్ని ఆమె గుర్తింపు తెచ్చిపెట్టాయి. కానీ ఆతర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.. దాంతో వివాహం చేసుకుంది ఈ అందాల తార. ఇక తల్లిగా బాధ్యతల తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమైంది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక కాజల్ విషయానికొస్తే కాజల్ ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us