
చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసింది. టీనేజ్లోనే స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. 16 ఏళ్లకే తోటి నటుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. 17 ఏళ్లకే తల్లిగా ప్రమోషన్ పొందింది. కానీ వైవాహిక బంధం ఎక్కువ కాలం సాగలేదు. విడాకుల తర్వాత మరోసారి నటిగా కెరీర్ ప్రారంభించి.. హాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ డింపుల్ కపాడియా. బాబీ (1973) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 16 సంవత్సరాల వయసులో పరిశ్రమలోకి ప్రవేశించి తెలియకుండానే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
17 సంవత్సరాల వయసులో తల్లి, 30 ఏళ్లు నిండకముందే విడాకులు తీసుకుంది. ఆమె అరంగేట్రం చేసిన వెంటనే, డింపుల్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత తన భర్త తాను సినిమాలు చేయకుండా మానేయాలని కోరుకున్నాడని చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత 25 సంవత్సరాల వయస్సులో ఇద్దరు కుమార్తెలకు ఒంటరి తల్లి అయ్యింది. 12 సంవత్సరాల విరామం తర్వాత డింపుల్ 1985లో సాగర్ సినిమాతో వెండితెరపై తిరిగి కనిపించింది.
Dimple
రుడాలి చిత్రానికి జాతీయ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో సహా ప్రతిష్టాత్మక అవార్డులను అందుకుంది. 2020లో క్రిస్టోఫర్ నోలన్ యొక్క టెనెట్‌లో నటించింది. ఇప్పటికీ డింపుల్ కపాడియాకు తిరుగులేదు. ఇటీవలి సంవత్సరాలలో ఆమె పఠాన్, తూ ఝూతీ మైన్ మక్కర్, తేరీ బాటన్ మే ఐసా ఉల్జా జియా, సాస్ బహు ఔర్ ఫ్లెమింగో చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి :
బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..