Siddu Moosewala: మరణం కూడా అతని సంపాదనను ఆపలేకపోయింది.. చనిపోయినా కోట్లు సంపాదిస్తున్న సింగర్..
యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట కేవలం ఐదు గంట్లలోనే మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. 29 వయసులోనే మరణించిన సిద్ధూ..చనిపోయేనాటికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయల్టీలు, డీల్స్ ద్వారా కోట్లు సంపాదించాడు.

సంగీత ప్రియులకు పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా సుపరిచితమే. అతని పాటలకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. కానీ అతిచిన్న వయసులోనే దుండగుల చేతిలో దుర్మరణం పాలయ్యారు. అప్పటివరకు తమతో ఎంతో సరదాగా ఉన్న గాయకుడు ఆకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచివెళ్లడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ సిద్ధూ మూసేవాలా సాంగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అతని మరణానంతరం కూడా తన పాటలు భారీగా సంపాదిస్తున్నాయి. 2023 ఏప్రిల్ 7న సిద్ధూ కొత్త పాట రిలీజ్ అయ్యింది. యూట్యూబ్ ఛానల్లో విడుదలైన ఈ పాట కేవలం ఐదు గంట్లలోనే మిలియన్స్ కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. 29 వయసులోనే మరణించిన సిద్ధూ..చనిపోయేనాటికి తన ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఇప్పటికీ తన యూట్యూబ్ రాయల్టీలు, డీల్స్ ద్వారా కోట్లు సంపాదించాడు.
సిద్ధూ మరణించేనాటికి ఆయన ఆస్తుల విలువ సుమారు 14 మిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు వంద కోట్లకంటే ఎక్కువే. ప్రస్తుతం అతని ఆస్తులన్నీ తన తల్లిదండ్రుల పేరు మీదకు బదిలీ చేసారు. ఆయన లైవ్ షోలు, కచేరీ వంటి వాటి కోసం సుమారు రూ. 20 లక్షలు.. బహిరంగ ప్రదర్శనలకు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా తీసుకునేవాడట. అతని వద్ద ఖరీదైన కార్లు.. ఇతరత్రా ఖరీదైన వస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.




సిద్దూ మరణించిన తర్వాత కూడా అతని యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు. యూట్యూబ్ పాలసీల ప్రకారం వ్యూస్ ఆధారంగా రాయల్టీలు అందిస్తుంది. అంటే ఏదైనా వీడియో లేదా పాట 1 మిలియన్ వ్యూస్ పొందితే.. వారికి 1000 డాలర్లను అందిస్తుంది. ఇక ఇటీవల విడుదలైన సిద్దూ కొత్త పాట 18 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ పొందింది. దీంతో ప్రస్తుతానికి యూట్యూబ్ దీనికి రూ. 14.3 లక్షలు అందించాల్సి ఉంది. ఇది మరింత ఎక్కువ వ్యూస్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్పాటిఫై.. వింక్ ఇతర మ్యూజిక్ ప్లా్ట్ ఫామ్స్ నుంచి అడ్వర్జైట్ మెంట్ డీల్స్, రాయల్టీల ద్వార సిద్దూ మరణానంతరం కూడా తన పాటల ద్వారా 2 కోట్లకు పైగా సంపాదించాడు.
