AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాస్టర్ సినిమా గురించి హీరో విజయ్‌ని కలిసిన డిస్టిబ్యూటర్లు.. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..

తమిళ, తెలుగు సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్. ఆయన సినిమా వస్తోందంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు.

మాస్టర్ సినిమా గురించి హీరో విజయ్‌ని కలిసిన డిస్టిబ్యూటర్లు.. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్..
uppula Raju
|

Updated on: Dec 07, 2020 | 4:50 PM

Share

తమిళ, తెలుగు సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో విజయ్. ఆయన సినిమా వస్తోందంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. వైవిధ్యమైన నటనతో విమర్శకులను సైతం ఆకట్టుకుంటాడు విజయ్. అంతేకాకుండా సోషల్ రెస్పాన్సిబులిటీకి సంబంధించిన ప్రాజెక్ట్స్‌ను విజయ్ ఎక్కువగా చేస్తుంటాడు. సమాజానికి తన వంతుగా మంచి చేయడానికి ముందు వరుసలో ఉంటాడు. ఇటీవలే ఓ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లుగా వార్తలు కూడా వచ్చాయి కానీ కుదరలేదు. ఇటీవల విజయ్‌ని తమిళనాడులోని డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్స్ అసోసియేషన్ స‌భ్యులు ఓ పనిమీద కలిసారు. అదేంటంటే..

విజయ్ హీరోగా ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న సినిమా మాస్టర్. ఈ సినిమా ద్వారా సమాజానికి మంచి మెసేజ్ఇ వ్వాలనుకుంటున్నాడు విజయ్. లాక్‌డౌన్ వల్ల సినిమా ఆలస్యమవుతూ వచ్చింది. ఇటీవల సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. అద్భుతమైన స్పందన వచ్చింది. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా డైరెక్ట్‌గా థియేటర్లోనే విడుదల చేస్తామని మేకర్స్ కూడా చెప్పారు. అయితే థియేటర్ల బిజినెస్‌ను దృష్టిలో ఉంచుకొని సినిమాను సంక్రాంతికి విడుదల చేయవలిసిందిగా డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్స్ అసోసియేషన్ స‌భ్యులు విజయ్‌ని కలిసారు. అయితే అలాగే చేస్తామని దీనికోసం తాను ప్రొడ్యూసర్‌తో మాట్లాడతానని వారికి మాటిచ్చారు విజయ్. దీంతో ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అయితే ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.

షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
దానిమ్మ పండు ఎవరు తినొద్దు.. ఎర్రని గింజల వెనుక దాగి ఉన్న అసలు..
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఆయుష్షు పెరగాలంటే దీనికి మించిన పవర్ ఫుల్ ఫుడ్ లేదు!
ఆయుష్షు పెరగాలంటే దీనికి మించిన పవర్ ఫుల్ ఫుడ్ లేదు!
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్