దిశ ఆత్మహత్య కేసులో ట్విస్ట్
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దిశా మరణం గురించి పుకార్లు వ్యాప్తించారంటూ
Disha Salain father complaint: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దిశా మరణం గురించి పుకార్లు వ్యాప్తించారంటూ ముగ్గురు వ్యక్తులపై ఆమె తండ్రి సతీష్ సలియన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరు సుశాంత్ మరణాన్ని, దిశా మరణాన్ని కలిపి వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారని.. తమ కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పుకార్లు సృష్టించారని సతీష్ ముంబయిలోని మల్వాని పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. సతీష్ ఫిర్యాదు చేసిన లిస్ట్‌లో నటుడు పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలు ఉన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
మరోవైపు సతీష్ ఇచ్చిన ఫిర్యాదును సీరియస్‌గా తీసుకుంటున్నట్లు ముంబయి పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఆయన ఫిర్యాదు మేరకు వారిపై ఐటీ చట్టం, ఐపీసీ విభాగాలు కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చట్టపరమైన అభిప్రాయాలు తీసుకున్న తరువాత, దీనిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. ఆ తరువాత ఆ ముగ్గురిని విచారించనున్నారు. కాగా జూన్ 8న దిశ ఆత్మహత్య చేసుకోగా, జూన్ 14ను సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరిద్దరి మరణాల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు సైతం ఆరోపణలు చేస్తోన్న విషయం తెలిసిందే.
Read More: