అధికారిక ప్రకటన: సుక్కు సమర్పణలో ధరమ్ తేజ్ థ్రిల్లర్ మూవీ
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 15వ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో సాయి తేజ్ నటించనున్నారు.
Sai Dharam Tej Next movie: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ 15వ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో సాయి తేజ్ నటించనున్నారు. మిస్టికల్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్‌ని విడుదల చేశారు. అందులో చెట్టు మొద్దు మధ్య భాగంలో సాయి ధరమ్ తేజ్ కన్ను ఉండగా.. ”సిద్దార్థి నామ సంవత్సరే.. బృహస్పతిః సింహరాశౌ స్థిత సమయే, అంతిమ పుష్కరే” అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తానికి ఈ లుక్‌ని చూస్తుంటే సాయి ధరమ్ తేజ్ ఏదో ప్రయోగం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ మూవీకి లెక్కల మాస్టర్ సుకుమార్ కథను అందించడంతో పాటు ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సుకుమార్‌తో పాటు శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విడుదలకు సిద్ధంగా ఉండగా., దేవకట్టా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.
Read More:
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్.. ప్రారంభమైన షూటింగ్
ఆగష్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి
Trying a new genre is always exciting. That too in association with one of my favorite movie maker Sukumar garu makes it all the more special. #SDT15 is a mystical thriller produced by @SVCCofficial and @SukumarWritings Directed by @karthikdandu86 pic.twitter.com/lBP8entrls
— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 14, 2020