‘మేల్ ప్రెగ్నెన్సీ’పై బాలీవుడ్‌లో సినిమా.. హీరో ఎవరంటే!

మరో ప్రయోగాత్మక చిత్రానికి బాలీవుడ్‌ రెడీ అవుతోంది. మేల్‌ ప్రెగ్నెన్సీపై మూవీ తీసేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి.

'మేల్ ప్రెగ్నెన్సీ'పై బాలీవుడ్‌లో సినిమా.. హీరో ఎవరంటే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 14, 2020 | 3:13 PM

Movie on Male Pregnancy: మరో ప్రయోగాత్మక చిత్రానికి బాలీవుడ్‌ రెడీ అవుతోంది. మేల్‌ ప్రెగ్నెన్సీపై మూవీ తీసేందుకు అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవిత కథను తెరకెక్కించిన షాద్‌ అలీ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. సూర్మలో ప్రధాన పాత్ర పోషించిన దిల్జీత్‌ సింగ్‌.. ఈ మూవీలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరగుతున్నాయి. అయితే ఈ కథా నేపథ్యంలో ఇప్పటికే పంజాబీలో ఓ మూవీ రాగా.. ఆ చిత్ర రీమేక్ కాదని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఇక ఇందులో యువ హీరోయిన్ నటించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Read More:

అధికారిక ప్రకటన: సుక్కు సమర్పణలో ధరమ్‌ తేజ్‌ థ్రిల్లర్ మూవీ

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌.. ప్రారంభమైన షూటింగ్‌