Breaking News
  • తెలంగాణ లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ, రాయలసీమ మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ద్రోణి. తూర్పు బీహార్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. దీనికి అనుబంధంగా 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. ఈశాన్య ఝార్ఖండ్, ఒరిస్సా మీదుగా 1.5 కి.మీ 5.8 కి.మీ ఎత్తు మధ్య ఏర్పడిన మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఈరోజు సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీవర్షాలు. ఎల్లుండి ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం.
  • కడప: ప్రొద్దుటూరులో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల ఫోర్జరీ కేసు. నిందితుడు సుబ్రమణ్యంరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరికొందరిని ప్రమేయం ఉన్నట్టు గుర్తింపు.
  • ఈ దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. విజయదశమి రోజునుప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ధరణి పోర్టల్ ను ఆరోజు ప్రారంభిస్తారు. ధరణి పోర్టల్ ప్రారంభించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను ఈ లోపుగానే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
  • ముంబై: బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు. ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరైన దీపికాపదుకొనె. ముంబై కొలాబాలోని ఎన్సీబీ గెస్ట్‌హౌజ్‌లో దీపికా విచారణ. కరీష్మా, దీపికా చాటింగ్‌పై ఎన్సీబీ ప్రశ్నల వర్షం. కరీష్మాతో పరిచయం, డ్రగ్స్‌ సప్లయ్‌పై 4 గంటలుగా విచారణ. పల్లార్డ్‌లోని ఎన్సీబీ కార్యాలయంలో శ్రద్ధా, సారా విచారణ. త్వరలో కరణ్‌జోహార్‌కు సమన్లు జారీ చేసే అవకాశం.
  • మంచిర్యాల: బెల్లంపల్లిలో భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన. అదనపు కట్నం కోసం భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త మధుకర్‌. గతేడాది ఫిబ్రవరిలో మధుకర్‌తో విజయ వివాహం. అదనపు కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ వేధింపులు. అత్తింటివారితో ప్రాణహాని ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు.
  • గుంటూరు: టీడీపీ నేత నన్నపనేని రాజకుమారికి గాయం. తెనాలిలోని తన ఇంట్లో కాలుజారిపడ్డ నన్నపనేని. నన్నపనేని రాజకుమారి తలకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు.

అధికారిక ప్రకటన: సుక్కు సమర్పణలో ధరమ్‌ తేజ్‌ థ్రిల్లర్ మూవీ

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ 15వ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో సాయి తేజ్ నటించనున్నారు.

Sai Dharam Tej Next movie, అధికారిక ప్రకటన: సుక్కు సమర్పణలో ధరమ్‌ తేజ్‌ థ్రిల్లర్ మూవీ

Sai Dharam Tej Next movie: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ 15వ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. కొత్త దర్శకుడు కార్తీక్ దర్శకత్వంలో సాయి తేజ్ నటించనున్నారు. మిస్టికల్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సందర్భంగా ఓ ప్రీ లుక్‌ని విడుదల చేశారు. అందులో చెట్టు మొద్దు మధ్య భాగంలో సాయి ధరమ్‌ తేజ్‌ కన్ను ఉండగా..  ”సిద్దార్థి నామ సంవత్సరే.. బృహస్పతిః సింహరాశౌ స్థిత సమయే,  అంతిమ పుష్కరే” అన్న వ్యాఖ్యలు ఉన్నాయి. మొత్తానికి ఈ లుక్‌ని చూస్తుంటే సాయి ధరమ్‌ తేజ్‌ ఏదో ప్రయోగం చేస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా ఈ మూవీకి లెక్కల మాస్టర్ సుకుమార్ కథను అందించడంతో పాటు ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సుకుమార్‌తో పాటు శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌ విడుదలకు సిద్ధంగా ఉండగా., దేవకట్టా దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు.

Read More:

క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌.. ప్రారంభమైన షూటింగ్‌

ఆగష్టు 15 వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Related Tags