AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV : ఆయన పాటలంటే నాకు పిచ్చి ఇష్టం.. ఇండస్ట్రీకి రాకముందే ఆయన క్రేజ్ చూశా.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా పరిశ్రమలోని పరిస్థితులను, దర్శకుల నిజాయితీ గురించి ఆసక్తికర విషయాలు ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేక్షకుల అభిరుచులు తరచుగా మారుతున్నాయని, సినీ నిర్మాణంలో అంతర్గత మరియు బాహ్య అంచనాలకు మధ్య తేడాలున్నాయని వివరించారు. ఇళయరాజా సంగీతానికి జనాల్లో ఉన్న అపూర్వ ఆదరణను, ఇండస్ట్రీ అంచనాలకు భిన్నంగా తన శివ సినిమాకు ఆయనను ఎంచుకున్న అనుభవాన్ని పంచుకున్నారు.

RGV : ఆయన పాటలంటే నాకు పిచ్చి ఇష్టం.. ఇండస్ట్రీకి రాకముందే ఆయన క్రేజ్ చూశా.. రామ్ గోపాల్ వర్మ..
Rgv
Rajitha Chanti
|

Updated on: Jul 04, 2026 | 1:31 PM

Share

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా పరిశ్రమలోని సంక్లిష్టతలను, అంతర్గత డైనమిక్స్ ను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సినిమా నిర్మాణంలో నిజాయితీ, దర్శకుల అసలు ఉద్దేశం, ప్రేక్షకుల ఆదరణ మధ్య తరచుగా కనిపించే వ్యత్యాసాలను ఆయన స్పష్టం చేశారు. మజీద్ మజీది తీసిన “చిల్డ్రన్ ఆఫ్ గాడ్” సినిమాను ఉదాహరణగా తీసుకున్నారు. ఈ సినిమా 40 లక్షల బడ్జెట్‌తో నిర్మితమై అంతర్జాతీయంగా 40 మిలియన్ డాలర్ల రెవెన్యూను సాధించిందని ఆర్జీవీ పేర్కొన్నారు. అయితే దీనిని 25 కోట్ల బడ్జెట్‌తో రీమేక్ చేసినప్పుడు, బాలనటుడికి భారీ రెమ్యునరేషన్ చెల్లించడం, ఇన్-ఫిల్మ్ యాడ్స్ వంటి వాణిజ్యపరమైన అంశాలపై దృష్టి పెట్టడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైందని వివరించారు. “ఒకరు పిల్లల కోసం తీస్తే, మరొకరు పిల్లల నుంచి డబ్బులు సంపాదించడం కోసం తీశారు” అంటూ ఉద్దేశంలోని తేడాను వెల్లడించారు. సినిమా పరిశ్రమలో ఒక చిత్రం ఎందుకు విజయం సాధిస్తుంది, లేదా ఎందుకు పరాజయం పాలవుతుంది అనే దానిపై స్పష్టమైన లాజిక్ ఉండదని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..

దర్శకుడి ఇంటెన్షన్, ప్రేక్షకుల రిసెప్షన్ మధ్య ఎప్పుడూ డిస్‌కనెక్ట్ ఉంటుందని ఆయన అన్నారు. గోవింద్ నిహలానీ తీసిన అర్థ్ సత్య సినిమాను తండ్రి-కొడుకుల సంబంధం ఆధారంగా తీశానని చెప్పగా, ఆర్జీవీ మాత్రం అందులోని రామశెట్టి అనే విలన్ పాత్ర కోసమే తాను ఆ చిత్రాన్ని పదేపదే చూశానని చెప్పి దర్శకుడిని ఆశ్చర్యపరిచారు. అలాగే, బ్యాండిట్ క్వీన్ తెలుగు రీమేక్ అసలు చిత్రాని కంటే పది రెట్లు ఎక్కువ ఆడిన విషయాన్ని ఉదహరిస్తూ, ఆడియన్స్ అభిరుచి ఎంత విచిత్రంగా ఉంటుందో వివరించారు. సినిమా పరిశ్రమలోని వ్యక్తులకు సాధారణంగా ప్రేక్షకుల నాడి అంతగా తెలియదని ఆర్జీవీ పేర్కొన్నారు. దీనికి ఉదాహరణగా ఇళయరాజా సంగీతానికి ఉన్న ఆదరణ గురించి ప్రస్తావించారు.

ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..

తాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నప్పుడు ఇళయరాజా అంత పాపులర్ అని ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదని, కానీ తాను విజయవాడలో విద్యార్థిగా ఉన్న రోజుల్లో క్యాసెట్ షాపుల్లో చక్రవర్తి వంటి వారికి ఒక బుక్ ఉంటే, ఇళయరాజాకు ప్రత్యేకంగా ఒక బుక్ ఉండేదని, ఆయనకు ఉన్న అపారమైన అభిమానాన్ని అప్పుడే గుర్తించానని తెలిపారు. తన శివ సినిమాకు ఇళయరాజాను సంగీత దర్శకుడిగా ఎంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమని, ఆ సమయంలో చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు చక్రవర్తిని తీసుకోవాలని సూచించినప్పటికీ, తాను ఇళయరాజానే కావాలని పట్టుబట్టానని ఆర్జీవీ గుర్తు చేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..

Follow Us