AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల.. ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..!

వరుస హిట్లతో అనతికాలంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిన డైరెక్టర్‌లలో కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల..

షాకింగ్ నిర్ణయం తీసుకున్న కొరటాల.. ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 16, 2020 | 3:40 PM

Share

వరుస హిట్లతో అనతికాలంలోనే టాప్ దర్శకుడిగా ఎదిగిన డైరెక్టర్‌లలో కొరటాల శివ ఒకరు. మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కొరటాల.. ఈ తరువాత ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్‌’, ‘భరత్‌ అనే నేను’లతో వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు సంచలన నిర్ణయం ప్రకటించారు. మరో ఐదేళ్లలో తాను రిటైర్మెంట్ తీసుకుంటానని కొరటాల చెప్పుకొచ్చారు.

”మరో ఐదేళ్లలో నేను రిటైర్మెంట్ తీసుకోవచ్చు. ఆ తరువాత నా స్థానాన్ని కొత్త దర్శకులు రీప్లేస్ చేయొచ్చు. ఈ లోపలే నేను రాసుకున్న కథలన్నింటిని తెరకెక్కిస్తా” అని కొరటాల చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి ఆచార్య గురించి మాట్లాడుతూ.. ”ఈ మూవీ షూటింగ్ 40శాతం పూర్తైంది. లాక్‌డౌన్ లేకపోయి ఉంటే ఈ చిత్రషూటింగ్ దాదాపుగా పూర్తయ్యేది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ ఏం చేయలేరు. నటీనటులు కూడా తమ డేట్లను అడ్జెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది” అని కొరటాల తెలిపారు. ఇక తదుపరి చిత్రం గురించి ఇంకా తాను ఏం అనుకోలేదని.. అప్పుడు ఏ హీరో అందుబాటులో ఉంటే వారితో తీస్తానని కొరటాల పేర్కొన్నారు. అయితే ఈ నిర్ణయంతో కొరటాల ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక కథాంశాలతో కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే అలవాటున్న ఈ దర్శకుడు అంత త్వరగా రిటైర్మెంట్ తీసుకోవడం ఏంటని వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పటి పరిస్థితులను బట్టి కొరటాల తన నిర్ణయాన్ని మార్చుకుంటారేమో చూడాలి.

Read This Story Also: నాగార్జున, టబు రిలేషన్‌పై అమల ఏమన్నారంటే..!

Follow Us
ఏమున్నా్డ్రా బాబూ.. స్టన్నింగ్ లుక్‏తో టాలీవుడ్ హీరో..
ఏమున్నా్డ్రా బాబూ.. స్టన్నింగ్ లుక్‏తో టాలీవుడ్ హీరో..
అమరావతి రాజధానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
అమరావతి రాజధానిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తెలుపు,బ్రౌన్ కాదు,ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోయే గుడ్లు!ఆ పక్షి
తెలుపు,బ్రౌన్ కాదు,ఇంద్రధనస్సు రంగుల్లో మెరిసిపోయే గుడ్లు!ఆ పక్షి
సముద్ర గర్భంలో కాస్ట్‌లీ మందు సీసాలు..ఒక్కో బాటిల్‌కు రూ. కోట్లు!
సముద్ర గర్భంలో కాస్ట్‌లీ మందు సీసాలు..ఒక్కో బాటిల్‌కు రూ. కోట్లు!
6 విత్తనాల పవర్ లడ్డు.. రోజుకు ఒక్కటి తింటే కొండంత బలం మీ సొంతం
6 విత్తనాల పవర్ లడ్డు.. రోజుకు ఒక్కటి తింటే కొండంత బలం మీ సొంతం
ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న!
ఆ 4 రాశుల వారికి ముక్కు మీద కోపం.. కానీ మనసంతా వెన్న!
పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే..
పద్మ శ్రీ ఇచ్చేముందు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడిగారంటే..
తామరగింజల మసాలా మిక్చర్.. దీని ముందు నాన్ వెజ్ కూరలు కూడా జుజుబీ
తామరగింజల మసాలా మిక్చర్.. దీని ముందు నాన్ వెజ్ కూరలు కూడా జుజుబీ
వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..
వర్షాకాలంలో ఇవి ఇస్తే సన్నజాజి పూలు సంవత్సరమంతా విరగబూస్తాయ్..
బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!
బిల్ గేట్స్‌తో చెడిన స్నేహబంధం.. బఫెట్ సంచలన నిర్ణయం..!