Director Anil Ravipudi: డైరెక్టర్ అనిల్ రావిపూడి ఫ్యామిలీని చూశారా.. ? కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో..
చిన్న కథ... కానీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా.. ఫ్యాన్స్ అంచనాలకు చేరుకునేలా రూపొందిస్తూ దర్శకుడిగా సక్సెస్ అవుతున్నారు అనిల్ రావిపూడి. రెగ్యులర్ స్టోరీలనే తన ఫార్మాట్లో అద్భుతంగా చిత్రీకరిస్తూ వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇటీవల మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల సినీప్రియులకు సుపరిచితమైన దర్శకుడు. వరుస హిట్స్ అందుకుంటూ ఇప్పుడు విజయవంతంగా దూసుకుపోతున్నారు. గతేడాది సంక్రాంతి పండక్కి విక్టరీ వెంకటేశ్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను రూపొందించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ ఏడాది చిరంజీవితో కలిసి మన శంకరవరప్రసాద్ గారు మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ చిత్రంలో వింటేజ్ చిరును అడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. చిరు కామెడీ టైమింగ్, యాక్టింగ్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. జనవరి 12న విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ దూసుకుపోతుంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..
సంక్రాంతికి విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సినిమా రూ.360 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీ విజయం సాధించడంతో తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన కుటుంబంతో కలిసి శనివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని.. మరో పది నుంచి పదిహేను రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.
ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..
ఇదిలా ఉంటే.. అనిల్ రావిపూడి ఫ్యామిలీ మీడియా ముందుకు రావడం చాలా అరుదు. మొదటి సారి తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అనిల్ రావిపూడి నెక్ట్స్ ప్రాజెక్ట్ హీరో వెంకీతో ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..
Blockbuster Combination Back 🔥#AnilRavipudi Garu visited Tirumala to seek the divine blessings of Lord Venkateswara 🙏
🔔 Next movie update expected in the next 10–15 days#Venkateshpic.twitter.com/TNvNGCNNQB
— Milagro Movies (@MilagroMovies) January 31, 2026
ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..
