India: ఈ విషయంలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. సంచలనం రేపుతోన్న ఎలాన్ మస్క్ పోస్ట్..
ప్రపంచంలోనే జీడీపీలో భారత్ భారీ పెరుగుదుల నమోదు చేస్తోంది. ప్రపంచంలోనే భారత్ జీడీపీలో రెండో స్థానంలో నిలిచింది. ఈ మేరకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే జీడీపీలో టాప్ 10 లిస్ట్ ఇందులో ఉంది.

భారత్ శరవేగంగా అభివద్ద దిశగా దూసుకెళ్తుంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ వేగంగా డెవలప్ అవుతోంది. ప్రతీ రంగంలో వృద్ధి దిశగా వెళ్తుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా నిలుస్తోంది. జీడీపీలో భారత్ వేగంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వెనక్కి నెట్టేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుడు, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మాస్క్ చేసిన ఓ ట్వీట్ కీలకంగా మారింది. బ్యాలెన్స్ పవర్ మారుతుందంటూ ఆయన చేసిన ట్వీట్ కీలకంగా మారింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి డేటాను బయటపెట్టిన మాస్క్.. ప్రపంచ దేశాల జీడీపీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రెండో స్థానంలో భారత్
2026 ఐఎంఫ్ డేటా ప్రకారం ప్రపంచ జీడీపీ వృద్ధిలో టాప్ 10 దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో చైనా ఉంది. ప్రపంచ జీడీపీలో చైనా వాటా 26.2 శాతం ఉండగా ఉంది. ఇక భారత్ 17.0 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక యునైటెడ్ స్టేట్స్ 9.9 శాతంతో మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో 3.8 శాతంతో ఇండోనేషియా కొనసాగుతోంది. ఇక 2.2 శాతంతో తుర్కియే ఐదో స్థానంలో, 1.5 శాతంతో నైజిరియా ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు ఈ డేటా చెబుతోంది. ఇక బ్రెజిల్ 1.5 శాతంతో ఏడో స్థానం, 1.6 శాతంతో వియాత్రం ఎనిమిదో స్థానం, 1.7 శాతంతో సౌదీ అరేబియా తొమ్మిదో స్ధానంలో కొనసాగుతున్నట్లు ఈ డేటా చెబుతోంది. ఇక పదో స్థానంలో 0.9 శాతంతో జర్మనీ ఉంది. చైనా, భారతదేశం కలపి ప్రపంచ జీడీపీ వృద్ధిలో 43.6 శాతం వాటా కలిగి ఉన్నాయి.
పెరుగుతున్న భారత్ గ్రాప్
జీడీపీలో భారత్ స్థానం నానాటికి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా జీడీపీలో భారత్ దూసుకుపోతుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా భారత ఆర్ధక వ్యవస్థగా డెవలప్ అవుతోంది. రానున్న కొన్నేళ్లల్లో భారత్ అగ్రస్థానానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇటీవల పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వేలో కూడా భారత్ అత్యంత వేగంగా డెవలప్ అవుతున్న ఆర్ధిక వ్యవస్థగా కొనసాగుతుందని తెలిపింది. 2026-27 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8 నుంచి 7.2 శాతం మధ్య ఉంటుందని అంచనా వేసింది. 2025-26 ఆర్ధిక సంవత్సరంలో దేశ జీడీపీ గ్రోత్ రేటు 7.4 శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ దేశ జీడీపీ వేగంగా వృద్ధి చెందుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆర్ధిక సంస్కరణలకు ఇందుకు ఊతమిస్తున్నాయి.
The balance of power is changing https://t.co/mzk1KRHkcg
— Elon Musk (@elonmusk) January 31, 2026
