AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదే స్పీడు..అదే జోష్.. సైకిల్ తొక్కుకుంటూ సభా వేదికకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు

అదే స్పీడు..అదే జోష్.. సైకిల్ తొక్కుకుంటూ సభా వేదికకు వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు

Balaraju Goud
|

Updated on: Jan 31, 2026 | 4:24 PM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు. ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించింది చిత్తూరు జిల్లా. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పేదలకు 5,555 ఈ-సైకిల్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గంలో చరిత్ర సృష్టించినట్లు ప్రకటించారు. ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించింది చిత్తూరు జిల్లా. ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పేదలకు 5,555 ఈ-సైకిల్లను సీఎం చంద్రబాబు పంపిణీ చేశారు. ప్రజలు సైకిల్‌కు ఓటు వేశారని, అభివృద్ధి అంటే ఏంటో తాము చేసి చూపించామని చంద్రబాబు అన్నారు. అంతకు ముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి పాల్గొని ఈ-సైకిల్‌పైనే స్వయంగా సైకిల్ తొక్కుకుండూ వేదిక వద్దకు చేరుకున్నారు.

కాగా, ఒకే రోజు 5,555 ఈ-సైకిళ్ల పంపిణీ చేపట్టి గిన్నిస్ రికార్డును సాధించినట్టు గిన్నిస్ బుక్ ప్రతినిధులు ప్రకటించారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని కాలుష్య రహితంగా చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా 5,555 ఈ-సైకిళ్ల పంపిణి చేశారు. ఈ-మోటరాడ్ అనే సంస్థ.. కుప్పంలోనే ఈ సైకిళ్లను అసెంబుల్ చేసి, జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Jan 31, 2026 04:21 PM