AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు

స్టార్ హీరోయిన్ శ్రీలీల తాజాగా యోగా కార్యక్రమంలో పాల్గొంది. ముంబైలో జరిగిన యోగ డే కార్యక్రమంలో శ్రీలీల పాల్గొంది. ఇదే కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం సతీమణి అమృతా ఫడ్నవీస్ , హీరో షాహిద్ కపూర్ హాజరయ్యారు. కాగా అక్కడ జరిగిన ఓ సంఘటన ఇప్పుడు శ్రీలీల అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది.

సీఎం భార్య అయితే మరీ అంత అహంకారమా..! స్టేజ్‌పై శ్రీలీలకు అవమానం.. మండిపడుతున్న అభిమానులు
Sreeleela
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2026 | 11:56 AM

Share

తెలుగులో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతుంది అందాల తార శ్రీలీల. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి అవకాశాలు అందుకుంది. తక్కువ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. యంగ్ హీరోలతో పాటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతోనూ నటించి మంచి విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు అవమానం జరిగింది అంటూ ఓ వీడియో సోషలో మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న (ఆదివారం) రోజున యోగ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీలీల కూడా పాల్గొంది. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఇదే కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం భార్య అమృత ఫెండ్నవీస్ , హీరో షాహిద్ కపూర్ కూడా హాజరయ్యారు.

ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

కొంత సేపు యోగాసనాలు వేసిన తర్వాత యోగాకు సంబంధించి పలు విషయాలు, అలాగే శారీకరంగా, మానసికంగా ధృడంగా అవ్వడానికి యోగా ఎలా ఉపయోగపడుతుందో చెప్పుకొచ్చారు అంతా బాగానే ఉంది కానీ మహారాష్ట్ర సీఎం భార్య తీరు పై నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. శ్రీలీలతో ఆమె ప్రవర్తించిన తీరు కరెక్ట్ కాదు అని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇంతకూ అక్కడ ఏం జరిగిందంటే..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

యోగాసనాల తర్వాత స్టేజ్ పై అమృత ఫడ్నవీస్, ఆమె కుమార్తె, శ్రీలీల కలిసి మీడియా ప్రతినిధులకు ఫొటోల కోసం ఫోజులిచ్చారు. అయితే అదే సమయంలో కొందరు మీడియా పీపుల్ అమృత ఫడ్నవీస్, ఆమె కూతురు ఫోటోలు మాత్రమే విడిగా కావలి అని అడగ్గా ఆమె ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. శ్రీలీలను దురుసుగా పక్కకు పో అని చెప్పడం ఇప్పుడు శ్రీలీల అభిమానులకు కోపమొచ్చేలా చేస్తుంది. స్టార్ హీరోయిన్ శ్రీలీలకు కాస్త మర్యాదగా చెప్పకుండా, చేతి వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వేళ్ళు అని చెప్తున్నా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దీని పై లీల అభిమానులు, పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంత సీఎం భార్య అయితే అంత అహంకారం పనికిరాదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి :Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us