AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది 5 సినిమాలే.. అందులో ఒకటి రూ.300కోట్ల బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే కనిపించకుండాపోయిన బ్యూటీ

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. అందులోనూ హీరోయిన్ గా రాణించడం చాలా కష్టం.. అందం అభినయం ఉన్నా అదృష్టం కూడా ఉండాలి. చాలా మంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే పాపులర్ అవుతూ ఆతర్వాత కనిపించకుండాపోతున్నారు .

చేసింది 5 సినిమాలే.. అందులో ఒకటి రూ.300కోట్ల బ్లాక్ బస్టర్.. కట్ చేస్తే కనిపించకుండాపోయిన బ్యూటీ
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2026 | 7:59 AM

Share

చాలా మంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకొని వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఒక్క సినిమా చాలు హీరోయిన్స్ రేంజ్ ను మార్చేస్తుంది. కానీ కొందరు భామలు మాత్రం ఎంత ప్రయత్నించినా ఆఫర్స్ అందుకోలేకపోతున్నారు. హిట్స్ కొట్టినా కూడా పెద్దగా అవకాశాలు అందుకోలేక సోషల్ మీడియాలో గడిపేస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మమనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలోకి వస్తుంది. ఈ అమ్మడు చేసింది 5 సినిమాలు అందులో ఒక్కటే పెద్ద హిట్.. ఎంత పెద్ద హిట్ అంటే ఏకంగా ఆ సినిమా రూ.300కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు.. అలాగే అవకాశాలు కూడా రాలేదు. దాంతో ఇప్పుడు ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు ఈ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు..

ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ.. అమృత అయ్యర్. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హనుమాన్ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ పేరు గట్టిగానే వినిపించింది. కానీ అవకాశాలు మాత్రం పెద్దగా అనుదుకోలేకపోయింది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాలు చేసింది ఈ అమ్మడు. దళపతి విజయ్ నటించిన విజిల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది అమృత. ఈ సినిమాతో అమృతకు మంచి గుర్తింపు వచ్చింది. అంతకు ముందు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లింగ సినిమాలో సైడ్ యాక్టర్ గా కనిపించింది ఈ భామ.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

ఇక తెలుగులో రామ్ పోతినేని హీరోగా నటించిన రెడ్ సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమా తర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఈ క్రమంలోనే హనుమాన్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. హనుమాన్ సినిమా అంత భారీ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. చివరిగా ఈ భామ చేసిన బచ్చల మల్లి సినిమా నిరాశపరిచింది. దాంతో ఈ చిన్నదానికి అవకాశాలు మరింత తగ్గాయి. ఇప్పుడు ఈ బ్యూటీ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. సోషల్ మీడియాలో ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి :Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

అమృత అయ్యర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us