‘నేను.. నా ఆల్టర్ ఈగోస్’ అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. హుషారుగా ఫోన్ ముందు డ్యాన్స్ చేస్తున్న దీపికా..

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్‏డేట్స్‏తోపాటు.

'నేను.. నా ఆల్టర్ ఈగోస్' అంటున్న బాలీవుడ్ బ్యూటీ.. హుషారుగా ఫోన్ ముందు డ్యాన్స్ చేస్తున్న దీపికా..
Rajitha Chanti

|

Feb 16, 2021 | 9:18 PM

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‏గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్‏డేట్స్‏తోపాటు.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంటారు. అలాగే సమాజంలోని విషయాలపై తన అభిప్రాయాలను కూడా తెలుపుతుంటుంది. తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

దీపికా షేర్ చేసిన వీడియోలో ఆమె రకారకాలుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ‘నేను.. నా ఆల్టర్ ఈగోస్’ అంటూ ఆవీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీపికా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ.. ఫుల్ బిజీగా ఉంది. భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’, షారుఖ్‌ ఖాన్‌తో ‘పఠాన్‌’, హృతిక్‌ రోషన్‌తో ‘ఫైటర్‌’ మూవీతో పాటు ప్రభాస్‌-నాగ్‌ అశ్విన్‌ చిత్రంలోనూ నటిస్తోంది. ఇక వీటితో పాటు భారీ బడ్జెట్‏తో తెరకెక్కబోతున్న ‘మ‌హాభార‌తం’లో కూడా నటించనున్నట్లుగా టాక్.

Also Read:

క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెడుతున్న ఇస్మార్ట్ హీరో.. తమిళ డైరెక్టర్ సినిమా చేయనున్న ఎనర్జిటిక్ స్టార్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu