AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

7.0 IMDB రేటింగ్.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఏంటంటే.?

2025 Highest Grossing Crime Thriller Film: 2 గంటల 37 నిమిషాల నిడివి గల ఈ అత్యధిక వసూళ్లు సాధించిన సస్పెన్స్ సినిమా ప్రస్తుతం OTTలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ మినిట్ నుంచి క్లైమాక్స్ వరకు సస్పెన్స్‌తో నిండి ఉంది. ఇక చివర్లో వచ్చే క్లైమాక్స్ చూస్తే కచ్చితంగా మీరు ఉలిక్కిపడతారు.

7.0 IMDB రేటింగ్.. మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్టులు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న ఈ థ్రిల్లర్ మూవీ ఏంటంటే.?
Crime Thriller Identity
Venkata Chari
|

Updated on: Aug 04, 2025 | 10:13 AM

Share

2025 Highest Grossing Crime Thriller Film: మీరు క్రైమ్-థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడితే, 2025 సంవత్సరంలో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమా మొదలైన తొలి నిమిషంలోనే ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ సినిమాను ఒకసారి చూడటం ప్రారంభిస్తే, క్లైమాక్స్ వరకు అలాగే చూస్తుండిపోతారు. ఈ సినిమా పేరు ‘ఐడెంటిటీ’.

‘ఐడెంటిటీ’ 2 గంటల 37 నిమిషాల నిడివి గల మలయాళ సినిమా.. ఇది తమిళం, తెలుగు, హిందీ, కన్నడ వంటి భాషలలో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం IMDbలో 7.3 రేటింగ్‌ను పొందింది. ‘ఐడెంటిటీ’ కథ ఒక పోలీసు అధికారి, స్కెచ్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది.

ఈ సినిమాలో కొత్త పజిల్స్ వారిద్దరినీ గందరగోళానికి గురి చేస్తాయి. ఇది సాధారణ హత్య కాదని, ఛేదించడానికి చాలా కష్టమైన కుట్ర అని వారిద్దరూ గ్రహిస్తారు. టోవినో థామస్, త్రిష కృష్ణన్, మందిరా బేడి, అజు వర్గీస్, గోపికా రమేష్ వంటి తారలు కీలక పాత్రల్లో కనిపించారు.

దాదాపు రూ. 12 కోట్లతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 18 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా 2025 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు చేసిన మూడవ మలయాళ చిత్రం.

సస్పెన్స్-థ్రిల్లర్ తో పాటు, ఈ సినిమాలో యాక్షన్ కూడా ఉంది. మీరు OTT లో ఇంట్లో కూర్చొని హాయిగా ఆనందించవచ్చు. ఈ సినిమా దేశంలో టాప్ 10 ట్రెండింగ్ జాబితాలో ఉంది. సినిమా మొదలైన తొలి నిముషం నుంచి క్లైమాక్స్ వరకు సీన్ సీన్‌కు ఉత్కంఠ తారా స్థాయికి చేరుకుటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..