Ali On Pawan Kalyan : మా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు… త్వరలో మేము కలిసి నటిస్తామన్న అలీ

టాలీవుడ్ ప్రముఖ కామెడియన్ అలీ హీరోగా నటిస్తున్న లాయర్ విశ్వనాథ్ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ మూవీ టీజర్ సందర్భంలో అలీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు...

Ali On Pawan Kalyan : మా ఇద్దరి మధ్య ఎటువంటి విబేధాలు లేవు... త్వరలో మేము కలిసి నటిస్తామన్న అలీ
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2021 | 1:15 PM

Ali On Pawan Kalyan : టాలీవుడ్ ప్రముఖ కామెడియన్ అలీ హీరోగా నటిస్తున్న లాయర్ విశ్వనాథ్ సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఈ మూవీ టీజర్ సందర్భంలో అలీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉన్న రిలేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను పవన్ కళ్యాణ్ ను దాదాపు ఏడాదిన్నర తర్వాత కలిశానని చెప్పారు. అంతేకాదు పవన్ కళ్యాణ్ తనతో మాట్లాడుతూ.. యోగక్షేమాలు తెలుసుకున్నారని.. మళ్ళీ కలుద్దామన్నారని చెప్పారు. మా ఇద్దరి మధ్య రాజకీయంగా దూరం ఏర్పడింది అంతేకానీ వ్యక్తిగతం ఎటువంటి విబేధాలు లేవని అన్నారు.. ఇక నేను పవన్ ను జీవితంలో ఎప్పుడూ కలవనని అనలేదు.. ఇక ఆయన కూడా తనని ఏమీ అందలేదని.. మా ఇద్దరి మధ్య అపోహలు మీడియా సృష్టే అని చెప్పారు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు.. ఇక ఆ మధ్య పవన్ ను కలవడానికి ట్రై చేశా.. అయితే అప్పుడు పుణేలో ఉన్నారని చెప్పారు అంతేకాదు.. ఈ ఏడాది పవన్ -అలీ మళ్ళీ కలిసి నటిస్తారని చెప్పారు.

అయితే అలీ ఇప్పుడు పవన్ గురించి మాట్లాడుతున్నది అంతా స్నేహం పై విలువ ఇచ్చి కాదని.. తన సినిమా ప్రమోషన్ కోసం పవన్ ఫ్యాన్స్ ను మంచి చేసుకుంటున్నాడంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.  ఇక పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఇద్దరూ మంచి స్నేహితులు. పవన్ ప్రతి చిత్రంలోనూ అలీ నటించారు. వీరిద్దరి మధ్య వృత్తి పరంమైన స్నేహంతో పాటు నిజజీవితంలో కూడా మంచి మైత్రి ఉండేది.. ‌గత ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య వివాదాలు ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఇక అలీ త్వరలో లాయర్ విశ్వనాథ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాల నాగేశ్వరరావు వరద దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎన్‌.వి సుధాకర్‌, సూర్య వంతరంలతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అలీ కూతురు జుబెరియా బాలనటిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం.

Also Read:

తండ్రితో ఉన్న ఈ మెగా హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. నెట్టింట్లో ఫోటో హల్‌చల్

జార్ఖండ్‌లో వెలుగుచూసిన దారుణం.. ఐదేళ్ల చిన్నారితో సహా ఐదుగురిని నరికి చంపిన దుండగులు..!