ఒక్కోపాత్రలో విభిన్న కోణాలు.. ప్రభాస్ ‘ఆదిపురుష్’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన డైరెక్టర్..
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 'సలార్' సినిమాలో
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు. అటు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ‘సలార్’ సినిమాలో నటిస్తూనే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం. ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ రామాయణ ఇతహాస గాథ ఆధారంగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ ఓంరౌత్ కోన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సంధర్బంగా డైరెక్టర్ ఓంరౌత్ మాట్లాడుతూ.. ఇలాంటి సబ్జెక్టు చేయడం చాలా కష్టమైన పని అని.. ప్రపంచంలోని హాఫ్ బిలియన్ ప్రేక్షకలకు మెప్పించేలా ఈ సినిమా ఉండబోతున్నట్లుగా తెలిపారు. ఇందులోని ఒక్క పాత్రలలో భిన్నమైన కోణాన్ని చూపించబోతున్నట్లుగా చెప్పుకోచ్చాడు. అంతేకాకుండా ఇటీవల ఆదిపురుష్ సినిమాపై వచ్చిన రూమర్స్ పై స్పందించాడు డైరెక్టర్. సినిమాపై ఏర్పడిన వివాదం అప్పటితోనే ముగిసిందని.. ప్రాజెక్ట్‌లో కొన్ని మార్పులు జరిగాయని తెలిపారు. ఇక ఈ సినిమా ఆగస్ట్ 8న 2022 థియేటర్లలోకి రానుంది.
Also Read:
ఆ నిర్మాణ సంస్థతో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ ?