ఆ నిర్మాణ సంస్థతో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ ?

టాలీవుడ్ శర్వానంద్ హీరోగా 'రన్ రాజా రన్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుజీత్. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‏తో కలిసి భారీ బడ్జెట్‏తో 'సాహో'

ఆ నిర్మాణ సంస్థతో కలిసి మరో సినిమాను పట్టాలెక్కించనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ ?
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 24, 2021 | 9:34 AM

టాలీవుడ్ శర్వానంద్ హీరోగా ‘రన్ రాజా రన్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుజీత్. ఆ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‏తో కలిసి భారీ బడ్జెట్‏తో ‘సాహో’ సినిమాను రూపొందించి సూపర్ హిట్‏ను తన ఖాతాలో వేసుకున్నాడు ఈ డైరెక్టర్. సాహో సినిమా తర్వాత సుజిత్ నుంచి ఎలాంటి మూవీ అప్‏డేట్ రాలేదు. తాజాగా సుజీత్ తన తదుపరి చిత్రాన్ని హిందీలోనే తీయాలనుకుంటున్నాట్లుగా తెలుస్తోంది.

ఇందుకోసం ఇప్పటికే బాలీవుడ్ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‏తో ఒప్పందం కుదుర్చుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ రాబోతున్నట్లుగా సమాచారం. సాహో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సుజీత్ తెలిపాడు. అలాగే ఈ మూవీలో ఎమోషనల్ యాంగిల్ టచ్ చేయనున్నట్లుగా చెప్పాడు. ఇందులో పవర్ ప్యాక్ట్ యాక్షన్ కంటెంట్ కూడా ఉంటుందని.. సాధ్యమైనంత త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించాలనుకుంటున్నట్లుగా చెప్పుకోచ్చాడు సుజీత్. జీ స్టూడియోస్, సుజీత్ కాంబోలో రాబోయే సినిమా భావోద్వేగపూరితంగా ఉంటుందని జీ స్టూడియోస్ సీఈవో అభిప్రాయం వ్యక్తం చేశారు. సుజీత్ లాంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో పనిచేయడం గౌరవాన్ని ఇస్తుందని చెప్పుకోచ్చారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా నటీనటులను ఎంపిక చేసే పనిలో చిత్రయూనిట్ ఉంది. మరీ ఇందులో ఎవరిని ఎంపిక చేయనున్నారనేది తెలియాల్సి ఉంది.

Also Read:

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్‏గా.. సహజ నటనతో పక్కింటి అబ్బాయిగా.. నాని లైఫ్ స్పెషల్ స్టోరీ..