Sridevi: దేవకన్య దివికేగి నేటితో మూడేళ్లు… ఆ సుందర రూపం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది..
Sri Devi Life Story: భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది అలనాటి అందాల తార శ్రీదేవి. బాల నటిగా కెరీర్ మొదలు పెట్టి దేశం గర్వించే స్థాయికి ఎదిగిన శ్రీదేవి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ప్రధాన ఘట్టాలు మీకోసం.. .
Follow us
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నటి శ్రీదేవి.
శ్రీదేవి 1963 ఆగస్టు 13న అప్పటి మద్రాసు, ఇప్పటి తమిళనాడులోని మీనం పట్టి అనే గ్రామంలో జన్మించారు.
అలనాటి ఈ అందాల తార 1967లో తొలిసారి బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
కమలహాసన్ తర్వాత శ్రీదేవి ఎక్కువగా నటించింది కృష్ణాతోనే.
ఎంతో మంది కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన శ్రీదేవి బోణీకపూర్ను 1996 జూన్ 2న వివాహం చేసుకుంది.
చాలా ఏళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శ్రీదేవి.. 2012లో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’లో నటించింది.
భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న శ్రీదేవీ 2018 ఫిబ్రవరి 24 దుబాయ్లో ప్రమాదవశాత్తు మరణించింది.