అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్‏గా.. సహజ నటనతో పక్కింటి అబ్బాయిగా.. నాని లైఫ్ స్పెషల్ స్టోరీ..

ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా.. సినీ పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి..

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నేచురల్ స్టార్‏గా.. సహజ నటనతో పక్కింటి అబ్బాయిగా.. నాని లైఫ్ స్పెషల్ స్టోరీ..
Follow us

|

Updated on: Feb 24, 2021 | 7:52 AM

Happy Birthday Nani:  ఏలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా.. సినీ పరిశ్రమలో టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు నేచురల్ స్టార్ నాని. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‏గా కెరీర్ ఆరంభించి.. అనుకోకుండా హీరోగా మారాడు ఈ హీరో. విలక్షణమైన నటనతోపాటు.. విభిన్న సినిమాలను చేయడం నాని స్టైల్. సినిమా చూస్తున్నంతసేపు నాని సహజ నటన అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. మన ఇంటి పక్క ఉండే అబ్బాయిగా అనిపించేలా ఉంటాడు నాని. అందుకే నేచరల్ స్టార్‏గా పరిశ్రమలో తనదైన శైలీలో అలరిస్తూ దూసుకుపోతున్నాడు నాని.

హీరోగా..

మొదట్లో నాని అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేస్తున్న సమయంలో.. అష్టాచెమ్మా సినిమా చేస్తున్నారు. అదే సమయంలో తెలిసినవారు ఆ సినిమాలోని హీరో క్యారెక్టర్ చేయాలని అడగ్గా అనుకోకుండా ఒప్పుకున్నాడు. ఇక ‘అష్టాచెమ్మా’తో మొదలైన నాని ప్రయాణం ఇటీవలే వచ్చిన ‘వి’ సినిమా వరకు ప్రేక్షకులను అలరిస్తునే ఉన్నాడు. మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని వరుస ఆఫర్లను అందుకున్నాడు నేచురల్ స్టార్. ఇక ఆ తర్వాత రాజమౌళి సినిమాలోనే ఛాన్స్ కొట్టేసాడు. దర్శకధీరుడు నానిలోని టాలెంట్‏ను గుర్తించి తన ‘ఈగ’ చిత్రంలో ప్రధాన పాత్రనే అందించారు రాజమౌళి. ‘ఈగ’తో నాని స్టార్ డమ్ కూడా రివ్వున పైకి దూసుకుపోయింది.. తనకు లభించిన స్టార్ డమ్‏ను నిలుపుకోవడానికి నాని ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు. ఇక ఆ తర్వాత నాని ఒకే రోజున రెండు సినిమాలను విడుదల చేసే రేంజ్‏కు ఎదిగిపోయాడు. అదే క్రమంలో ఒకే రోజున “ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు” చిత్రాలను విడుదల చేశారంటేనే నాని రేంజ్ ఏలా మారిందో చెప్పుకోవచ్చు. అందులో ఒకటి జనాన్ని మెప్పించింది. మరోటి ప్రేక్షకులను ఒప్పించింది.. నానికి 2015 సంవత్సరంలో సినిమాలు భలేగా వచ్చాయి. అప్పుడే ఒకే రోజున రెండు సినిమాలు విడుదల చేసి అలరించాడు.. ఆ యేడాదిలో చివరగా విడుదలైన నాని ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్‏కు తగ్గట్టుగానే అలరించింది. ఆ హిట్ తో చిత్రసీమలో నాని పట్టు మరింత పెరిగింది. 2017 సంవత్సరం నానికి రెండు సూపర్ హిట్స్‏ను చూపించింది. ‘నేను లోకల్’తో మురిపించిన నాని, తరువాత ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గానూ ఆకట్టుకున్నాడు..

ప్రొడక్షన్ రంగంలో..

అటు వెండితెరపై హీరోగా అలరిస్తూనే నిర్మాతగానూ మారాడు నాని. నిర్మాతగా మొదటి సినిమా ‘అ!’ ను నిర్మించాడు. వైవిధ్య కథాంశంతో తెరకెక్కిన ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఆ తరువాత విశ్వక్సేన్ హీరోగా ‘హిట్’ సినిమాను నిర్మించి ప్రశంసలు అందుకున్నాడు. నాని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పన్నెండేళ్ళ అయిన.. ఇప్పటికి నాని తన సహజ నటనతో అందరిని అలరిస్తూ వస్తున్నాడు. ఇప్పటి వరకు నాని 25 సినిమాలు పూర్తిచేశాడు. ఇక 25వ సినిమాగా తెరెకెక్కిన వి సినిమా కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో నాని నటించిన ‘వి’ ఓటీటీలో విడుదలై విజయాన్ని నమోదు చేసుకుంది. థియేటర్లు తెరిచాక ‘వి’ బిగ్ స్క్రీన్ పైకీ వచ్చింది. అయితే “ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్” అన్నట్టు పెద్ద తెరపై ‘వి’ అంతగా సందడి చేయలేకపోయింది. త్వరలోనే నాని ‘టక్ జగదీశ్’తో జనం ముందుకు రానున్నాడు. అతని మరో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ సెట్స్ పై ఉంది. ఇవే కాకుండా మరిన్ని ఆఫర్లను అందుకుంటూ.. ప్రేక్షకులను అలంరిస్తూ ఉండాలి. నేచురల్ స్టార్ నానికి పుట్టిన రోజు శుభకాంక్షలు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?