Aaradhya Bachchan: ఐశ్వర్య కూతురు డ్యాన్స్ ఎలా చేసిందో చూశారా..? పేరెంట్స్‌తో స్టెప్పులేసిన జూనియర్ బచ్చన్..
Aaradhya Bachchan Dancing Video Goes Viral: బాలీవుడ్ సెలిబ్రిటీ జోడిల్లో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌లు ఒకరు. వీరి గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య ఎక్కడికి వెళితే అక్కడికి,,,
Aaradhya Bachchan Dancing Video Goes Viral: బాలీవుడ్ సెలిబ్రిటీ జోడిల్లో ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్‌లు ఒకరు. వీరి గారాల పట్టి ఆరాధ్య బచ్చన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐశ్వర్య ఎక్కడికి వెళితే అక్కడికి తల్లి వెంట కనిపిస్తూ పలు సార్లు మీడియా దృష్టిని ఆకర్షించిందీ చిన్నరి. ఇక ఆరాధ్య తాజాగా ఓ వేదికపై స్టెప్పులేసింది. ఇప్పటి వరకు స్క్రీన్‌పై కనిపించని ఆరాధ్య ఎంతో ప్రాక్టీస్ ఉన్నట్లు స్టెప్పులు వేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బచ్చన్ ఫ్యామిలీ ఇటీవల ఐశ్వర్య బంధువు వివాహానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేజీపై అందరూ స్టెప్పులేశారు. దీంతో అనూహ్యంగా ఆరాధ్య కూడా తల్లిదండ్రులతో కాలు కదిపింది. ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించిన దేశీ గర్ల్ అనే పాటకు ఆరాధ్యా ఎంతో ప్రొఫెషనల్‌గా డ్యాన్స్ చేయడం విశేషం. ఇక పెళ్లికి హాజరైన వారు కొందరు ఈ డ్యాన్స్‌ను తమ మొబైల్ ఫోన్లనో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీంతో మాజీ ప్రపంచ సుందరి తనయ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.
View this post on Instagram