Mega Debut Heroine Childhood Pic : తండ్రితో ఉన్న ఈ మెగా హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. నెట్టింట్లో ఫోటో హల్‌చల్

మెగా హీరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీలో హీరోయిన్ గా నటించిన చిన్నదాని చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఆమె చిన్నప్పటి ఫోటో. మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ..

Mega Debut Heroine Childhood Pic : తండ్రితో ఉన్న ఈ మెగా హీరోయిన్‌ను గుర్తు పట్టారా.. నెట్టింట్లో ఫోటో హల్‌చల్
Follow us
Surya Kala

|

Updated on: Feb 24, 2021 | 12:48 PM

Mega Debut Heroine Childhood Pic : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమా రిలీజ్ కాకుండానే టీజర్స్ తో టాలీవుడ్ లో వరస ఆఫర్స్ ను అందుకుంది ఈ చిన్నది.. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అందం, అభినయం కలయిక తో ప్రేక్షకులతో పాటు.. సిని సెలబ్రెటీల దృష్టిని ఆకట్టుకుంది. ప్రేమికుల రోజుకి ముందుగా రిలీజైన ఉప్పెన తో విమర్శకుల ప్రశంసలను అందుకుంది. మరోవైపు ఉప్పెనలా వరస ఆఫర్స్ అందుకుంటుంది కృతి శెట్టి. మెగా హీరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉప్పెనతోనే హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టి ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం మెగా హీరో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీలో హీరోయిన్ గా నటించిన చిన్నదాని  చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఆమె చిన్నప్పటి ఫోటో. మంగుళూరుకి చెందిన ఈ బ్యూటీ గతేడాది ఫాథర్స్ డే రోజున ఈ ఫోటోని షేర్ చేసింది. కూతురు ఎప్పుడు తండ్రికి స్పెషల్.. ఇక ఏ తండ్రికైనా కూతురు అంటే ప్రాణం.. ఇదే విషయాన్ని కృతి శెట్టి ఒక సందర్భంలో తాను నాన్న కూచి అని చెప్పింది కన్నడ సోయగం.

ఉప్పెన రిలీజ్ కాకుండానే ఆఫర్స్ అందుకున్న ఈ సినిమానిపై మెగా స్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. కృతి సినిమా డేట్స్ ను కావాలంటే ఇప్పుడే బుక్ చేసుకోండి.. మూవీ రిలీజైతే ఇక ఆమె దొరకదు అని చెప్పారు.. ఆ మాటనే నిజం చేస్తూ.. ఇప్పుడు కృతి చేతిలో బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయి.

Also Read:

అసోంలో తీవ్రవాదానికి స్వస్తి పలికిన 1,039 మంది మిలిటెంట్లు.. సీఎం సోనోవాల్ సమక్షంలో లొంగుబాటు

ముసలి తనం రానివ్వని గాడిద పాల స్నానం .. ఖరము పాలు, చీజ్ అత్యంత ఖరీదు