Chiranjeevi: ‘నువ్వు శ్రీదేవి అయితే.. నేనే చిరంజీవిని అంటా’.. ఆకట్టుకుంటోన్న వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్.
గాడ్ ఫాదర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాల్తేరు వీరయ్య' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు..
గాడ్ ఫాదర్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. ఇందులో భాగంగానే తాజాగా సినిమాలోని సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది.
ఈ చిత్రంలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య చిత్రీకరించిన పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘నువ్వు శ్రీదేవీ అయితే.. నేనే చిరంజీవిని అంటా’ అనే సాగే ఆకట్టుకుంటోంది. ఫ్రాన్స్‌లోని మంచు కొండల్లో ఈ పాటను చిత్రీకరించారు. గట్టకట్టే చలిలో, మంచు కురుస్తున్న సమయంలో ఈ పాటను చిత్రీకరించారు. ఇటీవల ఈ పాట మేకింగ్‌కు సంబంధించిన వీడియోను చిరు సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ పాట విషయానికొస్తే.. చిరంజీవి మరోసారి క్లాసిక్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వాల్తేరు వీరయ్య పేరుకు మాస్ మూవీనే అయినప్పటికీ చిరు ఇందులో క్లాస్ లుక్‌లో కనిపించి అలరించారు. ఇక ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
ముఖ్యంగా శృతి హాసన్, చిరుల మధ్య వచ్చే డ్యాన్స్ స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. వాల్తేరు వీరయ్య చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి భారీ అంచనాల నడుమ విడుదలువతోన్న వాల్తేరు వీరయ్య బాక్సాఫీస్ ముందు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..